Friday, January 6, 2017

నా చెలి హృదయం నన్ను రమంటుంది

నా చెలి కోసం చిన్న  ప్రయత్నం



గాయమైంది  నా హృదయానికి 
నా ఈపిరుండదు  రేపటి ఉదయానికి
గారడీలు  మాట కాదు
గాలిలోనా కబురే కాదు

ఆ బ్రహ్మ చేతి రాతనుకోన
ఎవరి ఈ భామ గుండె కోతనుకో
ఎవరి ఏమని అనుకున్న
చివరికి విధిరాతని నేనే  బలి నై పోతున్న


నా  జ్ఞాపకం గతమంతా
నిలిచిపోయే నా చెలి చెంత
నా మౌనరాగం నీ వేళా
మరిచిపోయాను  నా చెలి మేళ


నా కనులలో కదలాడే కన్నీరు కాదని
నా మనసులో మెదలాడే రూపే తనది  కాదని

వెక్కిరింపుగా వెళ్లిపోయనే  నా వెన్నల
కన్నీరు మిగిలెను నా రెండు కన్నులకు
గాయమైంది  నా హృదయానికి 

Thursday, January 5, 2017

నా మొదటి లోకంలో నువ్వే నా ప్రాణ దేవతా

చిలిపిగా చిందేసే ఈ చిరు ప్రాయం 
ఇక అంటోంది నీ ప్రేమకు నీ దాసోహం 

ఇకవి వర్ణించని ఈ అందం 
కలగంటున్నమో  నేస్తం 


కలలే కంటున్న ప్రతి క్షణం మన కోసం  మన ప్రేమ కోసం
చేస్తావని నా ప్రతి కళా సాకారం 
నను కవిగా మార్చింది  ఈ ప్రేమ గీతం 

కావాలి ఇక నీ చిరునవ్వు దానికి సంగీతం 
ఇక నువ్వే కాదంటే నాకింకా కష్టం 

నను వీడిపోవడా నా ఈ ప్రాణం 

ఇక నేను నిర్జీవం 

**************నా మొదటి లోకంలో నువ్వే  నా ప్రాణ దేవతా 

AMMA

_"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి..