Wednesday, July 20, 2011

ప్రేమ వృత్తాంతం.



పరిచయం పరవశం,
ప్రేమ ప్రణయం.

క్షణమో కావ్యం,
కాలం కమనీయం.

భావాల బేధం,
అలుక అందం.

విరహం మూల్యం,
రాజి రమ్యం.

ఇదే ప్రేమ వృత్తాంతం.

తడి నయనాలు















కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు
ఉలిక్కిపడి నిదురలేచిన ఆశలు. దూరమయ్యే నీ మువ్వలచప్పుళ్ళు, ఆగిపోతున్న నాగుండె చప్పుళ్ళు. కనుమరుగవుతున్న నీ ప్రతిరూపం, కనులకు అది కన్నీటి శాపం. అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు, నా మనసుకి చీకటితోరణాలు. ఏకాంతంలో కదలాడే నీ తియ్యని జ్ఞాపకాలు, చెంతలేవని గుండెకుచేసే గాయాలు నీకై ఎదురుచూసే నా తడి నయనాలు, మనోరుధిరం నింపుకున్న ఎరుపుచారలు.

Tuesday, July 19, 2011

తొలిప్రేమ



ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే,

చెలిమాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతుంటే,

అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.

శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.

ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.

                              చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది.

ఒంటరిని.

ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.

ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.

ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.

ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.

ఆమె వెళ్ళిపోతుంది.


ఆమె ఎదురుపడింది.
గుండె వేగాన్ని పెంచేస్తూ,
కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది.
గతాన్నంతా చెరిపేస్తూ,
నాలో ప్రేమను గుర్తుచేస్తూ.

ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.

ఆమె కోపగించుకుంది.
నా ప్రేమను తిరస్కరిస్తూ,
నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది.
నా ఆనందాలను మూటగట్టేస్తూ,
నా కన్నుల నిండా నీరు నింపేస్తూ.

ఎదతడికై


ఓ హృదయ మేఘమా, నా మనసు చూడుమా.

నీ ప్రేమ రాల్చుమా, నా ఎదను తడుపుమా.

దాహం తీరక,ఆశలు ఆవిరైపోతున్నాయి.

చూపులు తగలక, కన్నులు చీకటైపోతున్నాయి.

నా గుండెలో తడి నింపుమా, నీ చూపుల వెలుగు పంచుమా.

ఒంటరి కిరణాలలో మాడిపోతున్నా, చల్లగా నీ మాటలు కురిపించుమా.

తొలకరి ప్రేమకై ఎదురుచూస్తున్నా, నా ప్రేమకు జీవం పోయుమా.

ఎదతడికై ఎదురుచూస్తున్నా, కంటతడినే కానుకగా ఇవ్వకుమా.

వలదురా!



బాధపడినంతనే బంధం నిలువదురా!

వదులుకున్న దానికై వేదన వలదురా!

భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా?

ప్రేమ పంచలేని ప్రతిమ మనకేలరా!

కన్నీటిని కాంచలేని రూపు కనుపాపలో ఏలరా?

మనసున్న మగువ మనద్దయ్యే రోజు ముందుందిరా!!

బ్రతికేస్తున్నా.


నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.

కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.

రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.

విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,

ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా.

ప్రేమ ఆమోదమే.


పుడమిని తడిపే స్వాతిచినుకు ఆనందమే,
చెలియ చూపుతో గుండెవణుకు ఆనందమే.

చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.

తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.

కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.

సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.

నీ తోడేగా!!


కనుచూపుకు కరువైనా,
కనుపాపవు నీవేగా!!

కనుపాపలో నీవున్నా,
తుది గమ్యం మనసేగా!!

ఇది పలికింది పెదవైనా,
తెలిపింది మనసేగా!!

ఆ మనసులే మౌనంగున్నా,
ప్రేమ పెదవంచునేగా!!

ఆ ప్రేమ నీవైన సమయానా,
ప్రతిక్షణం నీ నీడేగా,తుదిశ్వాసలో నీ తోడేగా!!

పరితపిస్తున్నా.



నింగిలోని జాబిలై నీకందనని నవ్వుతుంటే,
నీటినై నీ ప్రతిబింబాన్ని గుండెలో దాచుకుంటూ ఆనందిస్తున్నా.

అందనంత దూరంలో ఒయాసిస్సులా నీవుంటే,
గుండెనిండా ఆశలను నింపుకుంటూ బ్రతికేస్తున్నా.

మనసు నిండ ప్రేమనుంచుకోని కురిపించలేని మేఘంలా నీవుంటే,
నీ జ్ఞాపకాల వేడిలో బీటలుబారిని హృదయంతో ఎదురుచూస్తున్నా.

సంతోషాలన్ని నీలోనింపుకొని సెలయేటిలా ప్రవహిస్తున్నా,
నిలువదని తెలిసినా నా ప్రేమతో ఆనకట్ట వేసి నిన్ను ఆపాలని ఆశిస్తున్నా.


ప్రతిక్షణం నీ విరహం, నీ కోపం జ్ఞాపకలై నన్ను ఏడిపిస్తున్నా
ఆ జ్ఞాపకం మెదిలిన మరుక్షణం అన్ని మరచి మళ్ళీ నీ ప్రేమకోసం పరితపిస్తున్నా.

భాదపడను....


నీకై వేచిచూసి విసిగిపోయిన నాలో....

"మదికి, బుద్దికి మద్య విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.

జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.

ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు.

నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నవ్వై అమ్మానాన్నలు."

నీవిక చేరువ కావు,నవ్విక దూరం కాదు.
దక్కలేదని దుఖ్ఖం చెందను,అందలేదని అంతంచూడను.

కానుకిస్తూ.....

వర్షపు ఓడిలో,చినుకుల తడిలో,
ఒకటై నడుస్తూ,జతగా తడుస్తూ..

కదిలే గాజుల సవ్వడిలో,రాలే జాజుల ఒరవడిలో.
నా నడక తడబడితే,నువ్వు కనబడక మాయమైతే,

నీవు కానరాక నా కంటతడి,
అల్లంత దూరాన నా కంటపడి.

వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు

నీ చెంత చేరాకా,నా చింత తీరాక.
చినుకులన్నిటిని స్వాగతిస్తూ,నీ చేతికి కానుకిస్తూ.

నీ తోడులో.... వర్షం కురుస్తూ,కాలం కరుగుతూ,
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ హర్షంలో తడుస్తూ నేను.....
(or)
ఆ వర్షంలో తడుస్తూ నీవు,నీ కౌగిలిలో కరిగిపోతు నేను....

(pls select the best one)


మరపుకురాని క్షణాలు,మదిలో మేలిమి జ్ఞాపకాలు.

ప్రేమంటే....

నా కనుల నుండి జారే కన్నీరు కాదు వేదనంటే,
కనుల ముందు నీవున్నా మనసుకి మనసుకి మద్య దూరమే వేదనంటే.

గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు విరహమంటే,
జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే విరహమంటే.

నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే వియోగమంటే.

పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలలు కాదు ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం ప్రేమంటే.

మనసు మాయ


ఆవేదనో తెలియదు..... ఆనందమో తెలియదు......
ఒక్క సారిగా నీవు కనిపించగానే నా కన్నుల్లో కన్నీరు....

ఇన్నాళ్ళ విరహానికి విలువగానో !!
లేక
ఈనాటి కలయికకి కానుక గానో !!

బాధో తెలియదు, భారమో తెలియదు.....
నీకు చెప్పుకోలేక నా ప్రేమ పడే బాధ........

మనసులో దాగలేకనో !!
లేక
పెదవి నుండి దాటలేకనో !!

మధురమో తెలియదు, మైకమో తెలియదు......
నువ్వు ప్రేమించావని చెప్పగానే నా గుండె నిండిన అనుభూతి..

నీ మాట చినుకులు నా మనసులో ముత్యాలైనట్లు గానో !
లేక
నీ పెదవిమత్తులో మునిగిన పలుకులతో నా మనసుకి మైకం కమ్మినట్లో !!

నేను నచ్చలేదనో.... నిన్ను మరువలేకనొ....
నన్ను వదిలి నీ మనసులో చేరిపోయింది నా ప్రేమ....

తెలియని ఆనందం నీ మనసులో దొరికిందనో !
లేక
స్వేఛ్చ నిండిన భానిసత్వం నీ గుండెల్లొ నిండి వుందనో !!

మూగ మనసు


తెలవారుఝామున నీ కనుల గుమ్మం ముందు నిల్చొని
నీకు చిరునవ్వుతొ శుభోదయం తెలుపాలని.

నీవు నడిచే ప్రతిదారిలో నీ పాదాలు కందకుండా
నీకు పూలమార్గం వెయ్యాలని.

నీవు పొందే ప్రతి ఆనందంలో,
నీ చిరునవ్వునై నీ అధరాలపై నిలవాలని.

ఆలోచనలతో అలసిపోయిన నీ మనసుకి,
ఏకాంతంలో నేను జ్ఞాపకం కావాలని.

నా ఆలోచనలు మొదలైన మరుక్షణం,
నీ కనుపాపల నుండి జారే కన్నీరు నవ్వాలని.

అలసిపోయి నిదురించు వేళ,
నీకు ఆనందాలను అందించే కలగా మారాలని.

కనులనిండా కన్నీళ్ళతో,కలల నిండా ఆశలతో ఎదురుచూస్తున్నా,
కనీసం రేపైనా నా యీ భావాలని నీకు తెలుపాలని.

ఆస్వాదించలేవు.

నా మనసు మధించి నీకు ప్రేమామృతం అందిస్తున్నా ఆస్వాదించలేవు,

నీ చెలిమి నా మనసుకు సంతృప్తి నివ్వడం లేదన్నా అనురాగాన్ని అందించలేవు,

నీ ఏకాంతంలో నా ఆలోచనలకి స్థానం కావాలి అన్న అర్దంచేసుకోలేవు,

నీ మాటలలో మాధుర్యం మనసు పంచేదై ఉండాలన్నా ఆలకించలేవు,

నీ పెదవిపై నవ్వుగా, నీ కనులలో కన్నీరుగా నేను ఉండాలన్నా అంగీకరించలేవు,

ప్రతి క్షణం నీకై, నీడై, నీవై నీతో వుంటాను అన్నా ఆలోచించలేవు,

నీ చేరువలోనే ఈ దూరాన్ని భరించలేనన్నా పట్టించుకోవు,

చివరికి నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నీవేనని తెలుసుకోలేవు

దాచుకోలేక....



తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.

తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.

గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.

నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.

మన్నించు ప్రియ


ముసుగుకప్పిన నీ మాటాల తెరచాటున,
బయటపడలేక బంధించబడ్డ భావం ప్రేమ కాదా?

తడి ఆరని నీ కనుపాపల మాటున,
మసకబారిన నా రూపం దాచుంచడం ప్రేమ కాదా?

ప్రేమలేదని చెప్పే నీ మాటలతో,
నీ పెదవి ఒణుకు ప్రేమ కాదా?

గెలవలేమని తెలిసి నీ గుండెదాటని,
కలువలేమని తెలిసి నా మనసు చేరని అనురాగం ప్రేమ కాదా?

తలిదండ్రులు మన ప్రేమకు కంచెలు వేస్తుంటే...

అది దాటిరాలేక దుఖంలో నీవు,
నిను చేరుకోలేక చేతకాని వాడిలా నేను......

జీవితాంతం ప్రేమలేని ప్రాణులుగా బ్రతికేద్దాం......

ప్రేమిస్తున్నాను.


ఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,

నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!

ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!

గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!

ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!

ఒక్కమాటలో చెప్పలంటే-

"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".

అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".

మనసు-మాట


ను చూసిన మరుక్షణం నన్ను మరిచి నీవెంట నడిచే సమయాన,
ఈ మనసే నాది, అది వినే మాటే నీది.

కనులకు కమ్మిన నీ రూపం ప్రపంచాన్ని కప్పేస్తుంటే,
నా మనసే ఓ మాయ, నీ మాటే ఓ మంత్రం.

నీను చేరుకోవాలని నీలో కలిసిపోవాలనే ప్రయత్నంలో,
నా మాటే ఓ కెరటం, నీ మనసే నా తీరం.

నా ప్రేమను నీకు తెలియజేసే సమయానా,
నా మనసే ఓ మౌనరాగం, నీ మాటే నాకు అంగీకారభావం.

నీలో ఆ ప్రేమ లేదని తెలిసిన మరుక్షణాన,
నీ మాటే ఆయుధం, నా మనసే మానని గాయం.

అరవిరిసిన చిరునవ్వులు, అలరించిన చెలి చూపులు అబద్ధం అని తెలిసినప్పుడు,
నీ మనసే ఓ మోసం, నా మాటే ఇక మౌనం.

నీ స్నేహం


నా గుండెల్లొ దాచుకునే ఆనందాల ఐశ్వర్యం నీ స్నేహం.

నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం.

నా జీవనప్రయాణంలో అలసిపోయి సేదతీరే ప్రతి మజిలి నీ స్నేహం.

బాధలు నిండిన నా చీకటి జీవితంలో ఆనందాల వెన్నెల నీ స్నేహం.

పరిచాయలు ఎన్ని వున్న గుండెలో ప్రతిక్షణం వినిపించే స్పందన నీ స్నేహం.

నా ఆలోచనలకు, నా ఇష్టాలకు, నా చిరునవ్వులకు నిలువుటద్దం నీ స్నేహం.

ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..

నిరాశ..


మనసు ఉదయంలేని.... చీకటి లోకం.... నిన్ను కలిసేదాక.
అలోచనలు అలుపెరగని అలలు.... నీ పిలుపుల తీరం చేరేదాక.

మొగ్గతోడిగిన పువ్వులా నిన్ను చూసి సిగ్గులొలకపోసే నా మనసు.
తిరుగులేని కిరణంలా నీ మనసుపై ప్రేమను ఎలా ప్రకాశింపచేసిందో....

అంగీకారభావంతో ఈ అరుణోదయాన్ని ఆహ్లాదపరుస్తూ నువ్వొస్తావని ఎదురుచూసూ..
నిన్ను కలిసిన ప్రతిక్షణాన్ని నా మనోజాబిల్లి చుట్టూ చుక్కలుగా పేరుస్తూ..

విసుగు చెందిన ఉదయం కూడ విధిని వదిలి వెళ్ళిపోయింది.
వెలుగు నిండిన ఆశ కూడా కనుల నుండి జారిపోయింది.

కలలు కన్నీళ్ళుగా అలల తోడు చేరి నన్ను ఒంటరిని చేస్తుంటే.
మనసు తనకు ప్రేమను పంచలేకపోయవని ఎగతాళిచేస్తుంటే..

వెళ్ళిపోతున్న ప్రియా నా కలలకు కళ్ళెంవేస్తూ,ఆ అలలకు ఎదురెళ్తూ.
నీ కనుల నుండి దూరంగా... ఈ లోకం నుండి శాస్వతంగా...



















బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం.
మానవతను వదిలేద్దాం(1)

బ్రతుకు హీనమైపోతున్నా,
భవిత పాడైపోతున్న,
ప్రజలు చచ్చిపోతున్నా,
ప్రగతి పతనమవుతున్నా.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...(2)

రాష్ట్రం రగిలిపోతున్నా,
బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా,
ధరలు మండిపోతున్నా,

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....(3)

సిగ్గులేక బ్రతుకేద్దాం,
గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం.
మార్పు రాలేదని బాధపడదాం.
ఎదుటివారి మీద నిందలేద్దాం.

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతికేద్దాం.
స్వాతంత్రబానిసలుగా బ్రతికేద్దాం.

నన్ను మరిచిపో..


నువ్వు "నన్ను మరిచిపో"మని చెప్పిన.....

కనుల సరస్సులో ప్రేమ ఇంకా ఇంకిపోకుంది,

హృదయ స్పందనలో ప్రేమ ఇంకా ఆగిపోకుంది,

మది గదిలో ప్రేమ ఇంకా ఖాళీకాకుంది,

ఆలోచనని ఆణిచిపెట్టినా, జ్ఞాపకం కరిగిపోనంటుంది.

నీ ఊహలేని క్షణాన్ని కాలం దరిచేరనీయనంది.

ఇంక ఎలా మరి నిన్ను మరిచిపోయేది....?

ఒక్క మాటలో చెప్పనా నా జీవితంలో ప్రతిరోజు....

నిదుర కరిగిన కనులకు మొదటి రూపం, రెప్పవాల్చే కనులలో చేరే చివరి అందం నీ ఆలోచనే.

ఓడిపోయాను...


మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమ,
తుదిశ్వాసతోపాటూ వదిలి వెళ్ళిపోయిన, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

prema kavithalu

నేను నిజం కలగా మిగిలిపోయిందని భాదపడుతున్నా

చెదిరిన స్వప్నం..కలకాదు నిజం..?
జరిగింది కలలాంటి నిజం..మరి నిజమా కలనా..?
అంతరంగంలో అలజడి...ఎదో తేల్సుకోలేకున్నా..
అది కల అయినా నిజమైనా ..ఒక వాస్తవంగా మిగిలిన దుక్కం..
స్వప్నం స్వర్గానికి వెళ్ళీంది ...కల కాటికి పోయింది....
కనీటి సంద్రంలో అన్నీ కరిగిపోయాయి..
తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి..
ఎక్కడైనా కల నిజంకావాలని కోరుకుంటాం..
నేను నిజం కలగా మిగిలిపోయిందని భాదపడుతున్నా..
మరి గుండెల్లో అలజడులకు..గూడుకట్టుకున్న భావాలు చెప్పాలనిఉంది..
వినేవాళ్ళు..వినాల్సిన వాళ్ళు వినలేనంతదూరంగా ఉంటున్నారు..
అన్ని చెప్పాలని ఉంది ...గుండె పొరల్లోంచి మాటల రూపంలో బయటికొస్తున్నాయి..
అన్ని పెదాల మాటునే దాగి ఉన్నాయి...ఎంకంటే ఎదురుగా ఉంది సూన్యిం తను లేదక్కడ..
సూన్యింలోకి చూస్తే అన్నీ సుడిగుండాలే..నన్ను కబలించేందుకు దూచుకొస్తున్నాయి..
నీవు వచ్చేసరిని ఆ సుడిగుండాల్లో కనిపంచకుండా పోతానేమో నీకు చివరిచూపు కూడా మిగలదేమో ప్రియా....?

మృత్యువును ఆహ్వానిస్తూ ఆక్షనం కోసం...?

వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......
మృత్యువును ఆహ్వానిస్తూ ఆక్షనం కోసం
నీవు దూరం అయ్యాక విధిలేని పరిస్థితుల్లో..
నన్ను నేను అసహ్యించుకునేంతగా..
నువ్వు లేని నిజాన్ని నమ్మలేను
నిన్ను కల అని మరువలేను
నీ కలల హద్ధులు దాటలేను
నీ జ్ఞాపకాల చేరసాలలో ఉండలేను
నీ ఉహల కెరటాల తాకిడిని తాళలేను
నీ కౌగిలి తీరం చేరుతానన్న ఆశలేక
నీ శ్వాసల స్పర్శ లేని గాలిని పీల్చలేను
నీ తలపులతో నిండిన ఉపిరిని నిలవనంటుంది
అందుకే!
వేచియున్నాను ఆ మృత్యు సాగర తీరాన......

చేయని తప్పులకు నిందను ఎదుర్కోవలసి వస్తే..?

చేయని తప్పులకు నిందను ఎదుర్కోవలసి వస్తే..
నిజంగా అంత కంటే దారుణ మైన శిక్ష మరోటి ఉండదేమో..
కనీసం నేనేం చేయలేదని చెప్పుకునే అవకాశంలేకపోతే..
అంత మంది స్నేహితుల్లొ ఓక్కడ్ని దోషిగా నిలబెట్టి..
అందరి తో మాట్లాడుతూ నా ఒక్కడితో ఎందుకు మాట్లాడవు.
అని అడిగే దైర్యం ఎప్పుడో కోల్పోయాను తప్పదు..
ఒకప్పుడు అందరి స్నేహితుల కంటే ప్రత్యెకం ఇప్పుడు..
నీ స్నేహితులందరూ మంచివాళ్ళు నేను తప్ప కదా...
ఇలా ఎందికాలోచిస్తున్నాను ఏమి చేస్తున్నానో అర్దకాని పరిస్థితి..

తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను

మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమని,
తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?.నిజమైన స్నేహం అంటే

నా ప్రేమకు ప్రేరణ నువ్వు,
నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,
వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
నా గురించి అన్నీ తెల్సిన నీవు,
నన్నెందుకు మోసం చేశావు
ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,
ప్రేమ నేరమా మరి,
ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,
ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,
మనసులో గాయాలు చేసి మర్చిపోవడమా?
నిజమైన స్నేహం అంటే..?
ఆ గాయం ఓ మనిషిని ఎంతలా భాదపెడుతుందో
ఒక్కసారన్నా ఆలోచించావా..అంత సమయం ఉందానీకు
నాగురించి అంత తెల్సి ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు.
అయినా మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,
ప్రేమ నన్నేందుకు తననుంచి దూరం చేశావు,
నేనేం తప్పు చేయలేదని చెప్పినా ఎవ్వరూ వినరా
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,
ఇక తట్టుకోలేను నీ కెప్పటికి కనిపించకుడా పోవాలకుంటున్నా..
ఒకవేల నీవు నిజం తెల్సుకొని చూడాలనుకున్నా చూడలేవు..?
అనంత దూరం పోతున్నా...కొద్ది సమయమే ఉంది..?

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;
నా ఆవేదనలో ఓదార్పు వైనావు;
నా ఆనందంలో ఆత్మియతైనావు;
నా దారిలో నీడవైనావు;
నా మనసులో జ్యోతి వైనావు;
నా ప్రతి కల లోను నువ్వున్నావు;
కానీ వాస్తవంలో కలవైనావు;
నా ప్రతి జ్ఞాపకంలో నువ్వున్నావు;
కానీ ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయావు;
నా కళ్ళలో పదిలంగా ఓడిగిపోయావు;
కాని అంతలోనే కన్నీరులా కరిగిపోయావు;
ఆకాశమంత ఆప్యాయతను చూపించావు;
చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు;
తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు;
కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు;
కడదాక తోడుంటా నన్నావు;
కన్నీటి రుచి చూపించావు;
నేను లేకుండా నువ్వు సుఖంగా ఉంటానను కుంటున్నావు;
కాని ఏదో ఒక రోజు నువ్వు తెలుసు కుంటావు,
నా అంత ప్రేమ నీకు ఎక్కడా దొరకదని, నన్ను నిజంగా కోల్పోయానని..
చూసే రోజొకటి వస్తుంది చూడు... అప్పటికీ నేనుండొచ్చు లేకపోవచ్చు

నీ జ్ఞాపకాలతో నా ఒంటరి తనాన్ని దూరం చేసుకుంటున్న

నీతో చెప్పలేక!!

వీచే చల్ల గాలులలో నీ స్పర్శను ఆస్వాదిస్తున్న,
నీ జ్ఞాపకాలతో నా ఒంటరి తనాన్ని దూరం చేసుకుంటున్న,
కురిసే వర్షం లో నా కన్నీటిని దాచుకుంటున్న,
మనసులో ఉన్న ప్రేమను కూడా అలానే వెంట పెట్టుకొని ఉన్న నీతో చెప్పలేక!!
జరుతున్న ఘటనలను నమ్మలేక...నిజాన్ని మనసులో దాచలేక
ప్రతిక్షనం, ప్రతి నిమిషం మదన పడుతున్నా..నీకోసం ..
నేనెందుకిలా అవుతున్నానో ..నాకే ఎందుకిలా జరుగుతుందో తెలియట్లా..
మనుషుల్లో ఒక్కసారిగా ఇలా మారుతారా...మరి నేను అలాగే వున్నానుగా
నీ పై నాకున్న ప్రేమలో ఎలాంటి మార్పులేదు...నేను మారలేదు మారను కూడా..
అప్పుడెంత ప్రేమ ఉందో ఇప్పుడూ అంతకంటే ఎక్కువే ఉంది ..నీవంటే నాకెందుకో అంత ఇష్టం
నా గొంతులో ఊపిరి ఆగిపోయేవరకు నీమీద నా ప్రేమలో మార్పుండదు ప్రియా

ఎవ్వరూ నా స్నేహం ఆచూకీ తెలుపలేదు..?ఎందుకని

సూర్యతాపంతో ఎండిపోయిన సరస్సు లా,
మబ్బుల్లో దాగిన చందమామను అడిగాను,
జాబిలిలో వీచిన చిరుగాలిని అడిగాను,
వెన్నెల్లో విరిసిన మల్లెపూవును అడిగాను,
నింగిలో మెరిసిన నక్షత్రాలను అడిగాను,
నిశీధిలో కురిసిన మంచుబిందువులను అడిగాను ,
నా ప్రాణ స్నేహం ఎక్కడుందని..?
ఎవ్వరూ నా స్నేహం ఆచూకీ తెలుపలేదు..
చివరకు ఏమీ పాలుపోక,
నా హృదయాన్ని తట్టిచూశా...!
అక్కడే నా నేస్తం ప్రశాంతంగా నిద్రపోతుంది..
ఉలిక్కిపడి లేచి చూసా..పైన నక్షత్రాలు చుట్టూ చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించడంలేదు..

కదిలే కాలం కసితీర్చుకుంటుందా అన్నట్టు..జరిగే ఘటనలు..

జ్ఞాపకాలు..సుడిగుండాల వలయాలు
సంధ్యా కాలపు సుర్యుడి వెలుగులో....
సముద్రం ఒడిలో సేదతీరుతున్న వేళ
ఎగిసి వస్తున్న కెరటాల సవ్వడి....
గుండెళ్ళో పెరుగుతున్న జ్ఞాపకాల హోరు
కాలచక్రంలో కలిసిపొయిన వాస్తవాలని జ్ఞప్తికి తెస్తుంటే
ఆ మధుర స్మ్రుతుల తీయదాననికి పెదవులు దరహాసం చెస్తున్నా....
మది మాత్రం ఆ అనుభుతుల స్మరణలో......
భారంగా మారి ఎందుకు భాదిస్తుంది????
గత కాలపు మధురమైన అనుభవాలు కూడ...
సముద్రపు అలలలో చేరి ఎందుకు కల్లొల పరుస్తాయో.....
గదిచిన మధుర చేదు క్షణాలన్ని....
భవిష్యత్తు లో భాదనే ఎందుకు మిగులుస్తాయో.....
ఎంత ఆలోచించినా కొంచెంకూడా అర్దంకాదు....
మనసులో మదిస్తున్న మరపురాని జ్ఞాపకాల దొంతర..
కదిలే కాలం కసితీర్చుకుంటుందా అన్నట్టు..జరిగే ఘటనలు..
మనిషిలోని మనసును వేరుచేసే..పరిస్థితులు...
మనుషుల్లో ఒక్కసారిగా వస్తున్న మార్పులు ఎందుకు..
నిజానికి అబద్దానికి మద్యి తేడా తెల్సుకోలేనంతగా ఎందుకుంటున్నారు..
సమాదానం లేని ప్రశ్నలు...చెప్పేందుకు సిద్దంగా లేని మనుషులు..

నా పిచ్చి ప్రేమను హ్రుదయగవాక్షాల మధ్య బంధీ చేస్తున్నా నీకోసం

eసెలయేటి రాగాల సుమధుర గానం,
పిల్ల తుమ్మెరల అల్లరి మాధుర్యం,
హరివిల్లుల చిట్టి గుడారం,
నా ప్రేమ!

నిజం చెప్పాలంటే!

ఎవరెస్టుకంటె ఎత్తైనది,
ఆకాసమంత పరచుకున్నది,
బాధకంటె బరువైనది,
అగ్నికంటె స్వఛ్ఛమైనది,

నిజమే కదా!
ఎవరు భరించగలరు ఇటువంటి ప్రేమను!.. అందుకే,
నా పిచ్చి ప్రేమను హ్రుదయగవాక్షాల మధ్య బంధీ చేస్తున్నా నీకోసం,

వూహల రెక్కలకు సంకెళ్ళు వేస్తున్నా,
కలల మొగ్గలు చిదిమేస్తున్నా,
ఆశల సౌధాలు కూల్చేస్తున్నా,
మౌనరాగం ఆలపిస్తున్నా!

ఇకపై...

నీవు మిగిల్చిన ఏకాతంలో,
ఏ కాంతీ లేని, జీవితం జీవిస్తూ!
నీవు విదిల్చిన ఒంటరితనంలో,
నీ గురించి ప్రతిక్షనం ఆలోచిస్తూ,
నీవు నాకు దక్కవని తెల్సి,
నీవు లేని జీవితం నాకు వ్య్రర్దం కదా
ఒంటరిగానే ఈ తనువును చాలిస్తున్నా!త్వరలో

నీ ఫోన్ కాల్ ... నీ SMS వస్తే ఇక్కడ పెద్ద సీన్ అవుతోంది

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలా..
మొదట నమ్మలా తర్వాత నమ్మక తప్పలేదు..
నీ పేరుతో సహా అందరికీ చూపించి హాట్ జోక్సు నీమీద
అసలు మీ పరిచయం ఎలా అయిందో అర్దంకావడంలేదు..
ఆఫీసులో చాలామందికి తెల్సింది నివేవరో ..
ఆఫీసులో నీవే హాట్ టాపిక్ అవుతున్నావు అని నీకు తెల్సా..
నీ గురించి వాడు చెప్పే మాటలు చూస్తుంటే రక్తం ఉడుకుతోంది
నీవు ఎవ్వరికి తెలీదు అనుకుంటున్నావు ..అందరికి చెబుతున్నాడు గొప్పగా
నీవు ఫోన్ లో మాట్లాడే ప్రతి మాట ఇక్కడ అందరు వింటున్నారు అని తెల్సా
నీ ఫోన్ కాల్ ... నీ SMS వస్తే ఇక్కడ పెద్ద సీన్ అవుతోంది
SMS అందరికీ చూపించి వెకిలీ మాటలు చుస్తుంటే
ప్రతి నిమిషం నీకాల్ ఇక్కడ్ పెద్ద జోక్ అని తెల్సా నీకు
అంత ఇదిగా వాడికి ఎందుకు కాల్ చేస్తున్నావో అర్దంకావడంలేదు..
మొదట అర్దకాలేదు ఆ తర్వాత నిజం తెల్సింది
నీవు మాత్రం ఎవ్వరికీ తెలీదు అనుకుంటున్నావు నిజమే కదా
అందరు నవ్వుకుటున్నారు వాడు అలా చేస్తున్నాడు అని నీకు తెల్సా..
నిన్ను కల్సేందుకు వెలుతున్నాను అని అందరికి చెప్పి మరీ వెలుతున్నాడు..
ఎక్కడ కలుస్తున్నాం...ఏంచేస్తున్నాం అంటూ ఏవేవో చెబుతున్నాడు..
అలాంటి వాడితో తెల్సి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో తెలియట్లా
ఎంత దారుణంగా మాట్లాదుతుంటుంటే రక్తం ఉడుకుతోంది...

ఎందుకు దూరం అయ్యావు..అంత తప్పు చేశానా ...?

ఎన్నాళ్లిలా... ఎన్నేళ్లిలా
నవ్వును నా ముఖానికి
అతికించుకోను?
నీకోసం బలవంతంగా
పెదాలను సాగదీయగలనే గాని
ఇంకిపోయిన ఈ కన్నీటి చెలమల్లో
ఏ కలువ పూలు పూయించగలను?
నీ నిర్లక్ష్యపు సెగకి
రగిలిపోయి బూడిదగామిగిలినా ఇప్పుడు..
తిరిగి కోలుకోలేనంతగా మానసికంగా దెబ్బతిన్నా..
గతంలా మనం ఉండలేమని తెల్సినా ఎక్కడో చిన్ని ఆశ..
ఎవరన్నా ఆప్యాయంగా మాట్లాడితే నిజమా అని పిస్తుంది..

నీ వంటే నాకెంత ఇష్టమో తెల్సి నీవు ఇలా..
....నీవంటే ఇప్పటికీ ఆ ఇష్టం ఫోలేదు...
...ఆ ఇష్టం ఇప్పుడు నీ వంటే ప్రాణంగా మారింది..
మరి ఎందుకు దూరం అయ్యావు..అంత తప్పు చేశానాని..
అని భాదపడని తలచుకోని క్షనం లేదు..అంటే నమ్ముతావా..

.....ఇప్పుడని పిస్తుంది .....
....ఒకరికోసం ఒకరుగా........
....ఒకే ప్రాణంగా..విడదీయలేనంతగా....
....ఎవ్వరు ఏంచెప్పినా విననంత ఘాడంగా..
....అంత స్నేహంగా ఎలా ఉంటారు....
....అలా ఎలా ఉంటారు అనిపిస్తుంది......
....అదంతా నిజమేనా అనిపిస్తుంది.......

ఎంతకాలమని ఈ భాదబరించను..గుండె తట్టుకోలేకపోతుంది..

మౌనాన్ని ప్రేమిస్తున్నా...
నీ మాటలు వినిపించాలని...

వీచే గాలిని సైతం ప్రేమిస్తున్నా...
నిను తాకి నను చేరుతోందని...

పగటిపూట కూడా నిద్ర పోతున్నా...
స్వప్నంలో నిను చూడొచ్చని...

నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...కలుగుతుందని ఆశలేదు

అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా...
ఎందుకంటావా...ఎందుకోగూడా చెప్పలేను

నిను చూచినవేళ నా మాట మౌనమవుతుంది...
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...

అయినా హృదయాన్ని వీడిపోని ఆశ మాత్రం నిను చేరాలని తపిస్తూనే ఉంటుంది...
నిను చేరే భాగ్యం ఏనాటి కలిగేనో అని వేచి చూచే నా చిన్ని హృదయానికి ఏమని చెప్పను...
దాని ఆశను నెరవేర్చే ధైర్యం నాకు లేదని... నీవు నాకు దూరం అయ్యావని

ఎంతకాలమని ఈ భాదబరించను..గుండె తట్టుకోలేకపోతుంది..
నీ జ్ఞాపకాలతొ ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది...అందుకే..
నా ప్రాణం నిలవనంటుంది...చివరిసారిగా నిన్ను చూడాలని..
చివరిసారిగా నీతో ఏదో చెప్పాలని ఆశపడుతున్నా ప్రియా..
ఆశ నెరవేరుతుందో లేదో తెలీదు ..అప్పటిదాకా ఈ ఊపిరి ఉండక పోవచ్చు..?

ఆరోజెప్పుడు వస్తుందాని నీవే ఎదుచూస్తున్నావు కదూ...

క్షణక్షణం నీ తలపుల తలంపులో
తీరమెరుగని నావలా మానస సంద్రంలో
దిక్సూచీని వెదుకుతూ...
ప్రేమ చుక్కానికై పరితపిస్తున్నా
పచ్చని పచ్చిక బయళ్లు
వెచ్చని ఊసుల లోగిళ్లు
నా గుండె గది తలుపును తడుతుంటే
నీ రాకకై నిరీక్షిస్తున్నా
ఆమనికై వేచి చూసే కోయిలలా....
నువ్వు వస్తావని...
నా హృదయవీణపై ప్రణయరాగాలను
పలికిస్తావని వేచి చూస్తున్నా
వస్తావు కదూ...
..ఏమో నీవస్తావన్న నమ్మకం పోయింది..
అప్పటిదాకా ఈ ఊపిరి కచ్చితంగా ఉండదు ఇది మాత్రం నీజం..
ఇలా నేను అంటున్నాను అని తెల్సిస్తే ఓకప్పుడు కనీసం జాలి పడేదానివి ..
.....కాని ఇప్పుడు ఆరోజెప్పుడు వస్తుందాని నీవే ఎదుచూస్తున్నావు కదూ...
తొందర పడకు ఆరోజు త్వరలో నే వస్తుంది నీకు సంతోషాన్ని స్తుందిలే కదా...

నీ వనుకున్నట్టు నేను మంచివాన్ని కాదు కదా...?

నీ వనుకున్నట్టు నేను మంచివాన్ని కాదు కదా...?
నీమీద ఇప్పటికీ గుండెల నిండా ప్రమ ఉంది కాబట్టీ
నేను మంచి వాన్ని కాదు నిజమే నీవనుకుంటున్నాది..


నీవు సంతోషంగా ఉండటం కోసం..
ఎన్నీ విషయాల్లో కాంప్రమైజ్..నాకు మనసు కష్టం అనిపించినా ..
అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?

ఓ వ్యక్తికోసం నన్ను దారుణమైన మాటలు అన్నావు
అయినా భరించాను నీకోసం..తర్వాత అసలు నిజం తెల్సుకున్నావు
అప్పుడు ఎంత సంతోష పడ్డానో తెల్సా..అప్పటిదాకా పడ్డ భాదను మర్చిపోయాను..
అది ఎన్నాళ్ళో నివలవలేదు..భాదపడటం అలవాటైందిగా

అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?


అంతా నీ ఇష్టం ప్రకారం జరగాలని..
నీవు కోరుకున్నట్టే జరగాలని...
ఓ వ్యక్తిని సముదాయించే ప్రయత్న చేశాను..
అతను నిన్ను నమ్మక పోతుంటే నమ్మించే ప్రయత్నంచేశాను..
దాన్నే అదునుగాతీసుకొని నామీదే దాడికి ప్రయత్నించాడు
అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?

అతను చెప్పిందినమ్మీ నీవూ దాడికి వచ్చావు..నిజంతెల్సుకోకుండా
అతను మనసలో ఒక కారణం పెట్టుకొని..
మరో కారనం అంటూ నిన్ను నమ్మించాడు..
నాగురించి అంతగా తెల్సిన నీవూ అతన్నే నమ్మావు..
అప్పుడు నేను పడ్డ భాత అంతా ఇంతా కాదు తెల్సా
అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?


మొత్తానికి వాడు సాదించాడు ఎవ్వరికి తెలియకూడదో ..
ఎవ్వరికి తెలిస్తే..జీవితం నాశనం అవుతుందో..
వాళ్ళకి తెల్సేలా చేసి..నా మనస్సు తో ఆడుకున్నాడు..
అప్పట్లో నీవూ అదే నమ్మావు..ఇక నేను ఎవ్వరికి చెప్పుకోవాలి
అప్పుడు ఎన్ని విధాలు గా భాదపడ్డానో నాకు తెల్సు..
అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?

అలా వాడు పెట్టిన మంటల్లో ఇప్పటికీ భాదపడుతున్నా..
ప్రతి క్షనం ప్రతినిమిషం..అన్నీ నీకు తెల్సు ..
కాని నీవు నన్ను నమ్మవు... అతన్నే నమ్ముతావు..
అయినా నీ ఇష్ట ప్రకారమే జరగాలని కోరుకుంటా..
అందుకే నేను మంచివాన్ని కాదు కదా..?

చూసావా నేను ఎన్ని తప్పులు చేశాను ...
నిజమే అందుకే నేను మంచివాన్ని కాదు .
నీ స్నేహితుల్లా నేనొక్కన్నే నీచున్ని..
అందరూ మంచివాళ్ళు కదా..?

నా నుంచి దూరం అయిన తెల్లని ఆందమైన పావురం

ఓ చల్లని సాయం సంద్యివెళ... ఎదో ఆలో చిస్తూ ఉన్నా..
ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఓ తెల్లని అందమైన పావురం..
నా దగ్గరకు వచ్చి వాలింది..రెక్కల చప్పుడు చేస్తు నన్ను ఆకర్షించింది
మొదట నమ్మలా...చూస్తే చాలా ముద్దుగా ఉంది అందంగా ఉంది..
చూస్తుంటే అలాగే చూడాలని పిస్తుంది..అందమైన కళ్ళు..
ఆ పావురం చిలిపి చేష్టలు చూస్తూ దానితోనే ఎంతసేపైనా గడపాలనిపిస్తుంది..
అలా ఆపావురం వచ్చినప్పటినుంచి నాకు సమయం ఎలా గడుస్తుందో తెలీల..
రెక్కలున్న పావురం ఎప్పుడన్నా ఎగిరి పోతుందేమో అని ఫీల్ అయ్యేవాడిని..
అలా రోజులు క్షనాల్ల గడుస్తున్నాయి... ఆపావురంలేంది నేను లేనా అనిపించేంత పిచ్చిగా ఇష్టపడ్డా..
ఆ పావురం చిలిపి చేష్టలతో లోకాన్నే మర్చిపోయా నిజంగా..
ఏమైందో తెలీదు.. పావురం కనిపించడం మానేసింది.. చాలా భాదపడ్డా
ఆపావురన్ని అంతకుముందునుంచే ఎవరో పెంచుకుంటున్నారు అని తెల్సింది
వారు తీసుక పోయారని తెల్సి చాలా భాదపడ్డా ఇంక తిరిగి రాదేమో అని...
ఎలావచ్చిందో అలానే వెళ్ళీంది....ఆ పావురంకోసం ఎదురు చూస్తున్నా..
..... ఎప్పటికైనా తిరిగి రాదా అన్ని చిన్ని ఆశతో బ్రతుకుతూ..

అందుకే వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళి పోతున్నాను ప్రియతమా..?

ఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైంది
అలలా కవ్విస్తూ నను తాకావు నీవు
నేను ఆరాటపడ్డాను
నీ మనసు తెలుసుకోవాలని
నీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను
నీ మనసులో చోటు సంపాదించాలని
నా ఆరాటాన్ని ఆరాధించావు
నువ్వూ నా కోసం ఆరాటపడ్డావు
నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తావు
ఆశగా అమాంతం లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే నను ప్రేమగా చూస్తావు
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని
అందుకే వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళి పోతున్నాను ప్రియతమా..?
కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదు

ఇలా జరుగుతుందని అనుకోలేదు...అందుకే బ్రతకాలని లేదుఇలా జరుగుతుందని అనుకోలేదు...అందుకే బ్రతకాలని లేదు.. ప్రతిక్షనం నేను అనుభవిస్తున్న భాదను ఏవ్వరి తో పంచ

మన ఇరువురి మనసుల దూరం ఎంత...?........



నీ నయనాల నడుమ దూరం ఎంత?
నీ ఉచ్వాస నిశ్వాసల మద్య నిడివి ఎంత?
నీ గుండె చప్పుడుకు వేగం ఎంత?
నీ కనురెప్పలకు సవ్వడి ఎంత?
నీ అడుగులకు ఎడం ఎంత?
జవాబు నీ చిరునవ్వులో దాచుకున్నావా....
నేను చెప్పనా ,నిజం చెప్పనా
మన ఇరువురి మనసుల దూరమంత ....
రెప్పపాటు క్షణమంత....
మన ఆలోచనల పరుగంత.....
నీ జ్ఞాపకాల విలువంత....
మన ప్రేమకున్న వయసంత.....
నేను నిన్ను చేరుకునే అంత....

అయినా నీవు నన్ను చేరుకోలేనంత దూరం పోతున్నావు..
ఎందుకలా నానుంచి దూరంగా పరుగెడుతున్నావు..
దగ్గరవుదామని వస్తుంటే ఎందుకలా శత్రువులా చూస్తావు..

అందుకే నీపరుగు ఆపేసెయి హాయిగా ఉండు..
ఇక నానుంచి దూరంగా పోవాల్సిన పనిలేదు..
నేను నీకు ఎప్పటికి కానరానంత దూరంగా పోతున్నాలే..

కలకాలం నీస్నేహం నా ఒక్కడికే సొంత అన్నస్వార్దంతో....?

నీ చిరునవ్వుల తో నన్ను మైమరపించ జేశావు
అందుకే నీస్నేహాన్ని గుండెల్లో పదిలంగా దాచుకున్నా
కలకాలం నీస్నేహం నా ఒక్కడికే సొంత అన్నస్వార్దంతో
నన్ను నేను మర్చిపోయేంతగా నీస్నేంహం జల్లుల్లో తడిపావు
ఒడిదుడుకుల ఓటములను దాటగా ఓదార్పుల మాలను అల్లావు,
ఏ పువ్వుతో పోల్చను నీ స్నేహాన్ని.....
చెమరింతల చెక్కిల్లకు చేదోడుగా నిలువగా ఇంద్రధనస్సువై వచ్చావు,
ఏ రంగుతో పోల్చను నీ స్నేహాన్ని..................
కడలిన కలిసే ప్రవహాలేన్నైనా, కలిసే చోటు ఒక్కటే.......
మన ప్రయాణాలు వేరైనా.....నడిచే మార్గమొక్కటే......
ఎన్ని జన్మల వరమో నీ స్నేహం......
ఎన్ని తపస్సుల ఫలమో నీ స్నేహం.....

....కాని పిడుగు పాటున అనేక సంఘటనలు....
....ఒక్కసారిగా గుండెను అల్ల కల్లోలం చేశాయి...
..ఎందుకు అనుకునే లోపు ఏవేవే జరుగుతున్నాయి జరిగాయి....
....నా ప్రియనేస్తం నన్ను నమ్మటం లేదు నన్ను దోషిని చేసింది....
....నన్ను ఒంతరిని చేసి వెళ్ళిపోయింది ఎందుకో తెలీదు...
....ఒకప్పుడు నన్ను జాగ్రత్తగా చూసిన స్నేహం ఇప్పుడు ...?
..నాకేం జరిగినా...నేనేమైపోయినా పట్టించుకోనంతగా దూరం అయింది..
....అందుకే నా స్నేహానికి అక్కరికి రాని నా జీవితం నాకొద్దనే వెలుతున్నా..
....ఒకవేళ మనస్సు మారి చూడాలనుకున్నా చూడలేనంత దూరంగా..
....ఎవ్వరికి ఎన్నటికీ ...కనిపించే అవకాశం లేని ప్రదేశానికి పోతున్నా....
....వెళ్ళొస్తాను ప్రియనేస్తం ఎప్పటికీ నాది ఒకే ఒక్క చిన్ని కోరిక ...
....నీవెక్కడ ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండాలి...
....అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకో చాలు....

మనస్నేహం నిజమైనది అయితే ..?

మేఘంలో నీరులా కలిసాము....
వర్షంలో చినుకుగా విడిపోయినా
పుడమిపై జాలువారే నీటిలా కలుసుకుందాం....
మంచులా గాలిలో కరిగిపోఇనా...
మన స్నేహం నిజమైతే...తిరిగి..ఆ..మేగంలోనే మళ్ళీ
కలుసుకుందాం....మనమే నిజం అయితే ..
మనస్నేహం నిజమైనది అయితే ..?

నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో....నీకు తెలుసు

నిన్ను చూచిన ఆ క్షణం నా కళ్ళలో అలజడి
ఆ అలజడి మరిచిపొదామని కనులుమూసిన
నా మనసులో ఏదో గిలిగింత, ఎందుకి ఈ గిలిగింత అని అలొచిస్తే
నా హృదయంలొ నీ ప్రతిరూపం
ఎమిటి నా ఊహ అంత భ్రమయని అనుకొంటే...
ఆహా! ఎంతటి తీయని అనుభూతి
ఈ అనుభవం శాశ్వతమైతే
నీ రూపం నా మదిలొ నిలిచిపొతే
అమ్మో ఇదియే కాబోలు ప్రేమంటే...
ఈ అనుబవంతోనే అర్దం అవుతుంది ..
నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో..
మనం కల్సిపంచుకున్న బాసలు...
నామదిలో శాశ్వితంగా నిలిచాయి..
నిజాయితీగా మాట్లాడే నీమాటలు ఎప్పుడూ తలచుకొంటాను..
..... నీ మాటల్లో నిజాయితీ........
అప్యాయత ఇంతవరకు నేను చూడలేదు....
నీ పరిచయం నాజీవితంలో గొప్పమలుపు అనుకున్నా..
నా జీవితంలో నీలాంటి స్నేహం ఒక్కటి చాలు అని గర్వపడ్డా..
... నా అంత అదృష్టవంతుడు లేడని విర్రవీగా.....
... నా ఆనందం ఎక్కువరోజులు నిలువలేదు ఎందుకో..
.... మన మద్యి అడ్డుగోడ పెట్టారు అడ్డంగా నిలచారు...
నీవు దూరం అయ్యావు...నేను ఎలా వున్నది నాకు ముఖ్యింకాదు
నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి ...అదే నా చివరి కోరిక..
నాచుట్టూ ఎంత మంది ఉన్నా నీవు లేని లోటు ను తట్టుకోలేపోతున్నా..
... అందుకేనేమో నీవు లేని జీవితం వ్యర్దం అనిపిస్తుంది.....
.... నేను ఇక ఎక్కువరోజులు ఉండక పోవచ్చు..ప్రియా..

మరణిస్తున్నాను మన్నించు నేస్తం....మరణిస్తున్నాను మన్నించు నేస్తం మనసుతో ప్రతిక్షణం నేడు రేపుల మధ్య నలుగుతున్న జరిగిన ఘటనల దృశ్యాల మధ్య నన్ను నీవు దూరం

మరణిస్తున్నాను మన్నించు నేస్తం
మనసుతో ప్రతిక్షణం
నేడు రేపుల మధ్య నలుగుతున్న
జరిగిన ఘటనల దృశ్యాల మధ్య
నన్ను నీవు దూరం చేసిన క్షనాన్ని తలచుకొని
ఒంటరిగా అచేతనంగా.. నవ్వుకుంటూ
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

కలలు కళ్ళలై ఆగిపొతున్నా
కెరటాలు కదలనంటున్నా
నాకంటూ నీవు లేవన్న నిజాన్ని జీర్నించుకోలేక
ప్రతిక్షనం ఈ మానసిక ఘర్షనను తట్టుకోలేక
మనిషి లో మనసు చచ్చిపోయిన క్షనాన
ఆత్మసంఘర్షణల మధ్య .. కన్నీటితో
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..


ఆనందం కోసమో ..
అనురాగం కోసమో..
ఆప్యాయత కోసమో...
చిన్న మాటనోచుకోలేని...
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో
మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక
ఒక్కోసారి తగలబడుతున్న వెలుగు కంటే
కళ్ళు కనిపించనంత చీకటే నాయమనిపిస్తుంటే...
తట్టుకోలేక ..మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

జననానికి మరణానికి నడుమ మిగిలేది
ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే..
నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది
ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే..
అందుకే.. దేన్నీ ఆహ్వానించలేక
అలాగని త్యజించలేక
నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక
నాకు నీవు ఎప్పటికీ దక్కవన్న నిజాన్ని తట్టుకోలేక
మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి.

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి.
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి.

చిలిపిగా చూసిన ఆ కనుల కాంతిలో...
ఎప్పుడో మర్చిపోయిన నన్ను నేను కనుగొన్నాను.

నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి.
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి.

నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి.
నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి.

నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి.
నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి.
లేదంటే నాకు లోకమంటా సూన్యింగా కనిపిస్తుంది..

తట్టుకోలేక ..మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

ఆనందం కోసమో ..
అనురాగం కోసమో..
ఆప్యాయత కోసమో...
చిన్న మాటనోచుకోలేని...
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో
మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక
ఒక్కోసారి తగలబడుతున్న వెలుగు కంటే
కళ్ళు కనిపించనంత చీకటే నాయమనిపిస్తుంటే...
తట్టుకోలేక ..మరణిస్తున్నాను మన్నించు నేస్తం..

జ్ఞాపకాలు బాగా దయలేనివి, గుండెను అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి

ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంది......
జ్ఞాపకాలు బాగా దయలేనివి,గతాన్ని గుర్తుకు తెస్తాయి
నీకు మన గతం గుర్తుకు ఉందో లేదో..నేను ఎప్పటికి మర్చిపోను..
నీ స్నేహ మాదుర్యింలో ముంచేసి...ఎందుక లా అద్రుశ్యం అయ్యావు..
నన్నో పిచ్చివాన్ని చేసి మాయచేసి ఎక్కడికి పోయావు ప్రియా...
జ్ఞాపకాలు చాలా పదునైనవి గుండెను అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి...
బాధను దిగమింగే ప్రయత్నంలో బ్రతుకులు చీతిమంటలై కాలి పోతుంటాయి....!
ఒక ప్రయత్నం విఫల మన్న నిజం మనసుని సూతిమెత్తగా అనునిత్యం శిక్షిస్తుంది......
ఏది చేయాలో తోచని నేను,దేహం ఫుట్ పాత్ మీద అనాధ శవాన్నై వాలిపోతుంటాం....
ఇక అనుభూతుల పరంపర అమ్ముడుపొని దినపత్రికలా...
మిగిలిపోతుంది కనిపించక అనిపించే చావేదో ఆత్మహత్యను మరిపిస్తూ ఉంటుంది ..

చిరవరకు నాప్రాణం పోవడానికి నీవే కారణం అవుతున్నావు

ఎవరులేని ఒంటరి పయనంలో...
బంధాలే లేని నిర్మానుష్య లోకంలో...
నాకోసం వచ్చావు

మమతంటే ఎరగని మనసులో...
ప్రేమంటే తెలియని హృదయంలో...
చిరునామా అయ్యావు

నిరాశ నిండిన మనసులో...
రంగులు ప్రపంచం ఎరగని నా కనుపాపల్లో...
కాంతి నింపే వెలుగయ్యావు

సంతోషమెరగని జీవితంలో...
నాకోసం ఎవరూ లేని ప్రపంచంలో...
నీకోసం (నే)ఉన్నానంటూ అన్నీ నీవైనావు
మరి ఇప్పుడేమైనావు కానరాకుండా పోయావు..

జీవితంలో చెప్పలేని నిరాశ మిగిల్చావు..
జీవితంలో చెప్పలేనంత భాదను మిగిల్చావు..
చిరవరకు నాప్రాణం పోవడానికి నీవే కారణం అవుతున్నావు

కానీ నీవు నాకు చితిమంటలను నాకు పేర్చావు

నా ఆశలన్నీ నీరుగారిపోతున్నపుడు ,
ఆదరిస్తే అక్కున చేర్చుకుంటావనుకున్నా..
కాని,నన్ను అధఃపాతాళానికి అణచివేశావు ...!

నా నీడకు జోడుగా మెలగుతుంటే,
జీవితాంతం నా తోడుగా నిలుస్తావనుకున్నా..
కానీ, నడిమధ్యలోనే వీడ్కోలు పలికావు...!

నా ఒంటరి ప్రాణానికి నీ చేయినందిస్తే,
చేయూతతో చిరకాలం చెంత ఉంటావనుకున్నా..
కానీ, ఆ చిగురాశను నీ చిన్నచూపుతో చెరిపేశావు...!

నేను మౌనం నింగిన విహరిస్తున్నపుడు,
మాటల గాలిపటాలు ఎగురవేస్తావనుకున్నా..
కానీ,ఆ నింగికి మేఘాలను ఉసిగొల్పావు ...!

నీ పంచామృత పలుకులతో పలకరిస్తే,
ఎల్లప్పుడూ ఆనందసాగరంలో ఓలలాడిస్తావనుకున్నా..
కానీ,కన్నీటి సంద్రంలో నన్ను ముంచేశావు ...!

నీ మోముపై చిరునవ్వును చిందిస్తుంటే,
చిరుదివ్వెల చెలిమిని చిగురింపజేస్తావనుకున్నా..
కానీ నీవు నాకు చితిమంటలను నాకు పేర్చావు
అవి చితిమంటలు అయినా నాకు ఆనందమే పేర్చింది నీవు కాబట్టి..

నా హృదయం విషాద గీతాలతో విలపిస్తున్నది.

మబ్బుని వీడిన జల్లువై నా మధి స్రవంతి పవిత్రతను పెంచావు,
మరి ఈ ఆత్మీయుడిని ఎండగట్టి ఏ సాగరఘోషకి చేరువయ్యావో చెలి
అమావాస్య చీకట్లను వీడిన నెలవంకలా పౌర్ణమి వెలుగులను పంచావు,
కానీ అంతలోనే వేకువేరుగని కాలరాత్రులను కన్నులారా స్వాగతించేల చేశావు.
కిరణంతో మమేకమైన వెలుగుధారలా నవ్య ప్రభాతాన్ని నీ చెంతలో చూపించావు,
ఏ నియంత్రణలో ఈ మనసుకి అలుపెరుగని అరణ్య రోధనని మిగిల్చావో.
అరవిరిసిన కుసుమం వలె నాలో పరిమలత్వాని పెంచుతావనుకున్నాను
ఈ జన్మలో నా నవ్వుల పువ్వులు మొగ్గలోనే వాడిపోయేలా చేశావు.
రాగాల లోగిలి కానుకగా ఇచ్చిన సప్తస్వరాలతో మన మధుర స్మృతులను సరాగనివై వినిపించావు,
ఏ హంగులతో నన్ను వీడిపోయావో కానీ ఎన్నడు కఠినత్వాన్ని ఎరుగని
నా హృదయం విషాద గీతాలతో విలపిస్తున్నది.
నీ మౌనపు ఓదార్పు కోసం ఎదురుచూస్తూ పరితపిస్తున్నది ప్రియా..

కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది

tనీవు ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ
కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది

చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ
రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది

ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ
కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది

కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది
ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.

ప్రేమకు శక్తి ఉందో లేదో తెలియదుకానీ... నిన్ను చూశాకే నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపించింది. కానీ ఎందుకో నేను ఎరగనుకానీ... నాలోని స్పందన నీకు మాత్రం వినిపించనంటోంది.

అయినాసరే నిను చూశాక నాలో చెలరేగిన ప్రేమనే ఈ అలల తాకిడి నిన్ను సైతం తాకే వరకు ఇలాగే మౌనంగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కరుణించినా... కాదంటూ నన్ను గెంటేసినా నీకోసం సాగిస్తున్న ఈ నిరీక్షణ మాత్రం ఆగిపోదు సుమా…........

పోతే ప్రాణం పోతుందేమో ....నీవు లేని జీవితం నాకెందుకు ఉంటే ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత..

మనుసున్న మనిషికి మరణయాతన లెక్కువ...!

కలలున్న మనిషికి కన్నీరెక్కువ
మనుసున్న మనిషికి మరణయాతన లెక్కువ
కదిలి పోయే కాలానికి తొందరెక్కువ
మరణించే జీవికి మక్కువెక్కువ
వీచే గాలికి భందమెక్కువ
పారే జలపాతానికి పరువళ్ళు మక్కువ
కన్నీరుకి కనికరమెక్కువ..
జాలి లేని హృదయాలకు నిరాశలెక్కువ..
ఈ విధంగా అన్నింటిని గురించి చెప్పే
నాకు నీపై ప్రేమ ఎక్కువ...
అయినా నాపై నీకు కనికరం లేదుకదా..?
అందుకే నీవుదూరం అయినప్పటినుంచి నిరాశతో ఉన్నా ప్రియా..

మూసుకు పొతున్న కనురెప్పలను కాగడాల్లా మారుస్తున్నాను...

మూసుకు పొతున్న కనురెప్పలను కాగడాల్లా మారుస్తున్నాను...
కళ్ళలొ నుండి ఉరికి వస్తున్న కన్నిటిని పెదవులతొ ఆపుతున్నాను...
ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను...
ఇప్పుడు నీ జ్ఞాపకాల మేలి ముసుగును ఎప్పుడొస్తావాని ఎదురు చూస్తున్నాను...
నువ్వు వస్తావనే ఆశతొ...పోతున్న ప్రాణాన్ని ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తున్నా
ఆశ తీరుతుందో లేదో తెలీదు అప్పటిదాకా ఈ ప్రాణం నిలచేనా..ఏమో..?
గుండెలో ఊపిరి పోయినా నీకోసం నాకన్నులు అలాగే తెరిచి ఉంటాయి నేస్తమా.
నీవు వచ్చేసరిని ప్రానం లేదని తిరిగి వెళ్ళకు ప్రాణం పోయినా ఆ కళ్ళతొ నిన్ను దగ్గరగా చూడాలని ఉంది..

చంద్రుడు చూసే ఓర చూపు కోసం కలువలా..నీ రాక కోసం

నీ రాక కోసం...ఈ క్షణం
నువు నా చెంతన లేవని
కుంగిపోను నేను.నా ఎదురు చూపులు
నిన్ను చూసి ..జీవం పోసుకొంటాయి,
మిల మిల మెరిసే ..క్షణాల కోసం..
ఆశ పడతాను..వసంతం ఇచ్చే
చివురాకుల కోసం కోకిలలా,
చంద్రుడు చూసే ఓర చూపు కోసం కలువలా,
నీ రాక కోసం...నీ చుట్టూ
నా శ్వాసని ముడేసి, క్షణ క్షణం
నీ తలపుల్ని శ్వాసిస్తూ,నీ కోసం
ఎన్నాళ్ళైనా ..ఎదురు చూసే
ఆశా జీవిని నేను..రావని తెల్సినా..
రాలేవని తేలినా...ఒకప్పటినేను..
నీహుదిలో నేనని తెల్సినా..
మనసు మాటవినదుకదా..
అందుకే చకోరపక్షిలా నీకోసం ప్రాణం పోయే వరకు ఎదురు చూస్తాను..

ఆ మత్తే శాశ్వ్తంలోకంలోకి తీసుకెలుతుంది..

నాలో నేను లేనే లేను
నాకే నేను అర్థం కావట్లేదు
నాలో గోల ఏంటో మరి
నా ఈ స్థితి ఎందుకో మరి
పంచుకోలేను ఈ నా వేదన
ఉంచుకోలేను నా ఈ తపన
ఎలా ఉంటుందో ఎపుడు గుచ్చిందో తెలియని
ఓ మత్తు మెత్తగా కమ్మేసింది నన్ను...
ఆ మత్తే శాశ్వ్తంలోకంలోకి తీసుకెలుతుంది..
నీవు లేని మరొ ప్రపంచంలోకి నేనొక్కడినే వెలుతున్నా..
అక్కడ నీ చిరునవ్వులు ఉండవు ...నిన్ని చూడలేను ..
అయినా తప్పని పరిస్థితుల్లో తప్పక వెలుతున్నా..
నా ఆఖరి వీడ్కోలు నీకు చెప్ప పరిస్థితుల్లో నేను లేను..
ఎందుకో పోయేలోపు ఒక్కసారి నీతో మాట్లాడాలని ఉంది..
ఆకోరిక తీరదని తెల్సి కాని తీరని కోరికతో తీరందాటుతున్నా
నీకు ఏవేవో చెప్పాలని ఉంది...కాని.. కాని.. కాని..
....చెబుదామన్నీ వినే స్థితిలో నీవు లేవు ..

నా మనస్సు ఎక్కడున్నావంటూ ఇంకా ఎదురు చూస్తోంది

కమ్మని కలలా కనిపించే నువ్వు
ఎప్పటికి ఎదురౌతుంది నీ చిరునవ్వు
నిన్నే ప్రేమించే నా గుండె సవ్వడి
నా మనస్సు ఎక్కడున్నావంటూ ఇంకా ఎదురు చూస్తోంది
ఎక్కడినుంచో నీ మాటలు లీలగా వినిపిస్తున్నాయి
నీ జ్ఞాపకాలు ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాయి
నీ జ్ఞాపకాలు వదలలేను జీవితాంతం
" ఎప్పుడూ నీగురించి ఆలోచన...
నన్ను గురించి నేను మర్చిపోయా
ఎపుడో నీ గురించే గుండెల్లో నీ అలజడే
నీవు దూరం అయ్యావు నాకు నిదుర దూరం అయింది
" నిదుర లేస్తే
కనిపించే ఉదయం నువ్వే..
నిదురపోతే
కళ్ళనిండా నువ్వే..
" ఎదురుగా కనిపించేది
ఒట్టి ఆకాశమే...
నా హృదయంలో నిలిచింది
నీ అనంత రూపమే."
" ఎన్ని ఉదయాలు సరిపోతాయి
నీ హృదయం ముందు
ఎంత ప్రపంచం సరితూగుతుంది
నీపై నాకున్న ప్రేమ ముందు..

తగలబడుతున్న శవంలా ఎదురు చూస్తున్నా నీకోసం

అవును నేనే !!
నువ్వెప్పుడు వస్తావా అని "విరహం" అనే మరణ శయ్య పై
తగలబడుతున్న శవంలా ఎదురు చూస్తున్నా నీకోసం
ఎదురుచూస్తున్నది ...నేనే...ఎందుకంటే ఆశచావక
క్షణాలని కాపలాగా పెట్టి
నీ రాక కోసం అందరినీ అడిగి ,అడిగి
నోరెండిపోయిన ప్రేమ నది ని నేనే మరి
ఏం చేయను...
నీవు నన్ను విడచిపోయావు...వస్తావో..రావో తెలీదు
మూడు కాలాలు,ఆరు ఋతువులు ,చివరగా
లక్ష నిస్పృహలు గా అనిపిస్తోంది ....

ఎందుకు? ఎందుకు నీ కింత నిర్దయ నా మీద ...
జ్ఞాపకాలని ఇచ్చి మనసు తీసుకు పోయావ్
రాలేవా ......... ఒక్కసారి నా కోసం
అలిసిపోయిన ఆకాశం లాంటి నాకు
అరవిరిసిన నిండు పున్నమివై
నీతో మాట్లాడకుండా మూగపోయిన నా నోటికి
నీ నామావధానం చేసే ప్రేమ పలుకు వై !!
చివరగా..నా ప్రాణం పోయేలోపు చూడాలని ఉంది
నన్ను బ్రతికించ డానికి కావల్సింది ప్రాణ వాయువు కాదు .
నీ ప్రేమ వాయువు !!!
ఇట్లు...........
నీ కోసం ఎదురు చూసే
ప్రేమ జ్ఞాపకాలని ముద్రించుకున్న నీ మనసు జ్ఞాపికను..
నీవొస్తావని ఆశ చచ్చిపోతోంది రోజు రోజుకి..ఎదురు చూస్తున్నా
నీకు ఆఖరి చూపులు కూడా దక్కవు మరి...అయినా...?

జ్ఞాపకం ఒక కల..నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది

కల ఒక జ్ఞాపకం
గుర్తుకొచ్చి రాక తికమక పెడుతుంది
జ్ఞాపకం ఒక కల
నిజమో భ్రమో తెలియని అయోమయంలోకి నెడుతుంది
కలలాంటి జ్ఞాపకం
జ్ఞాపకం లాంటి కల
నువ్వే....

నీ ప్రేమలో నన్ను నేను వెతుక్కోవాలనుకుంటాను
నువ్వే కనిపించకుండా పోతావు
నీ సాన్నిహిత్యంలో సేద తీరాలనుకుంటాను
ఎండమావివై వెక్కిరిస్తావు
నీ ప్రేమరాహిత్యంలో ఘనీభవించిన హృదయాన్ని
నీ వెచ్చటి కన్నీటి జల్లుతో కరిగిస్తావు
కరిగి కన్నీరయిన నన్ను
మండుటేండగా మారి మరిగిస్తావు
హృదయం చాలని అనుభూతివనుకుంటే
జన్మకు చాలని ఆవేదన మిగిలిస్తావు

Monday, July 18, 2011

నీ ...హృదయాన్ని తట్టి చూడు..ఆ హృదయంలో నేనుంటా

పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు
సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ...చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో....నేనుంటా...
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ ...హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా.......

కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...

రాయాలని ఉంది నీకొక లేఖ
కట్టలు తెంచుకు వస్తున్న నా కన్నీటికి ఆనకట్ట కట్టలేక...
ఇకపై నిన్ను చూస్తానో లేదో అన్న బాధ గుండె లోతుల్లో దాచుకోలేక...
నువ్వంటే నాకు ఎంత అనురాగమో నీకు చెప్పలేక...
ఈ నా ఆవేదనను ఎవరితో పంచుకోలేక..
రాయాలని ఉంది నీకొక లేఖ

ఒంటరిగా ఉండలేక...
ఎవరినీ కలవలేక..
కలసినా మాట్లాడలేక..
ఆకలి లేక..
నిద్ర రాక..
నిన్ను మరచిపోలేక - అది నాకు చేత కాక..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

తడిసిన కనులతో,
అదురుతున్న గుండెతో,
వణుకుతున్న చేతులతో,
బొంగురుపోయిన గొంతుతో ..
రాయాలని ఉంది నీకొక లేఖ ..

నా ఈ బాధకు నువ్వు కారణం అని తెలిసినా..
అందులో నీ తప్పేమీ లేదని తెలిసినా..
నా వల్ల నువ్వు కూడా బాధ పడుతున్నవని తెలిసినా...
నువ్వు నా స్నేహాన్ని వదలవని తెలిసినా..
మనసు ఒప్పుకోక రాయాలని ఉంది నీకొక లేఖ..

నా ఈ పిచ్చి రాతలతో
నిన్ను బాధిస్తే కోపగించక మన్నించుమా నన్నికి..

ఎలా ప్రియా నన్ను నేను మార్చుకోనేది..ఎలా నిన్ను మరచిపోయేది

రోజుకొకసారి రగిలే ప్రళయాగ్నులు నీకు తెలుసా
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట జరిగే ఆ చోటు తెలుసా
ఆ చోటు నా మదిలో నిక్షిప్తమైతే
అది పడే బాధ తెలుసా
ఆనందానికి కారణం వుండదు ,బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం లేకుండా సాగే సాగే జీవితం నాది
కారణం లేకుండా నాకెందుకు దూరం అయ్యావో తెలీదు
అందుకే కనిపించని దూరాలకు కానరాకుండా ..
కనుమరుగై పోవలనుంది నాకు
ఎలా నిన్ను మరచిపోయేది

నువ్వొస్తావు..అని ఎదురు చూస్తున్నా...?

నువ్వొస్తావు....అని ఎదురు చూస్తున్నా
మలయ సమీరంతో మంద్ర సముద్రంగా
హొయలు హొయలుగా
కోటి ఊసులను మోసుకొస్తూ...

నువ్వొస్తావు..అని ఎదురు చూస్తున్నా

మండువేసవిలో పండువెన్నెలలా
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహుకుహూలకు శ్రుతి సరిచేస్తూ
రతీ మన్మధంలాగా...

నువ్వొస్తావు అని ఎదురు చూస్తున్నా

భావం, రాగం, తానం,పల్లవి
అన్ని తానైన ప్రణవనాదంలా
మంత్రజగత్తు సరిహద్దులను
సుతారంగా మీటుతూ
వెయ్యి వసంతాల చంద్రోదయంతో..

నువ్వొస్తావు అని ఎదురు చూస్తున్నా

నువ్వూ నేనూ సంగమించే క్షణం...
నువ్వూ నేనూ ప్రణవించే క్షణం..
నువ్వూ నేనూ వూసులల్లుకునే క్షణం..

నువ్వొస్తావు...అని ఎదురు చూస్తున్నా
అమరనాదాలను మోసుకొస్తూ..
నువ్వొస్తావు.. అని ఎదురు చూస్తున్నా

నా గొంతులో ఊపిరి ఆగే వరకు ఎదురు చూస్తూనే ఉంటా...?

నీ గూర్చి నేను కన్న స్వప్నాలన్నీ...చెల్లా చెదురు చేసింది నీవే కదా!

హృదయ నేస్తమా
కరిగిపోయిన కమ్మని కలని
జ్ఞాపకం చేస్తావెందుకు?
నీ గూర్చి నేను కన్న స్వప్నాలన్నీ
చెల్లా చెదురు చేసింది నీవే కదా!
నీకోసం యుగాలు నిరీక్షించాలనుకున్నా
నీ కోసం సమస్త ప్రపంచాన్నీ
ఎదిరించాలనుకున్నా
నేనంటే నేను కాదు
నేనంటే నీవే అనుకున్నా
కానీ నువ్వు
నన్ను అగాధంలోకి నేట్టేసావు
శిధిలమయిన
నా హ్రుదయాన్ని ముక్కలు చేశావు
ప్రతి ముక్కలోనూ
నీకోసం వెతికి వెతికి
అలసిపోయాను
కనిపించలేదు శిశిరంలోని రాలిన ఆకులా
హిమ శిఖరం నుండి జారిన తుషారంలా
వానిలా నీకోసం వైతరినిలో మునిగి పోయాను
మళ్ళీ ఇప్పుడు ,ఇన్నాళ్ళకు
నా కళ్ళముందు
చెదిరిన స్వప్నాల మూటని
విప్పమంటావు
ఒక్కో ఆత్మీయపు పలుకరింపు
జోడిస్తావు
జ్ఞాపకాల గాయాల మురళిని
గేయంగా మారుస్తానంటావు
కమ్మని ని పాటకి పల్లవి కమ్మంటావు
ఇదేం..న్యాయం నేస్తమా ...?

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...

సాయం సంధ్యలలో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది


ఐతేనేం... పున్నమి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల రాజు కాంతుల్లో...
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
నా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ

ఆత్మ'హత్య'

గుట్టలు గుట్టలుగా
శవాల కుప్పలు

తల లేని మొండెం
ఆత్రంగా తడుముకుంటోంది

ఆగిపోయిన శ్వాస
నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది

మూతబడిన కనులు
రెప్పల్లోంచి చూస్తున్నాయి

తెరుచుకున్న నోరు
కొత్త వేదం పలుకుతోంది

తెగిపడిన చేయి
గుండె కోసం వెదుకుతోంది

రాబందుల రెక్కలతో
కాళ్లు ఎగురుతున్నాయి

చుట్టూవాలిన ఈగలు
మౌనగీతం పాడుతున్నాయి

దూరంగా నేను
మౌనంగా చూస్తున్నాను

ఆత్మను చంపి
అంత్యక్రియలు చేస్తున్నాను

దూరంగా చూస్తున్న రెంటు కళ్ళు..
నాకు ఎంతో నాకిష్టమైన ఆ రెండు కళ్ళు
ఎప్పుడు దూకుదామాని అంటున్న కంటి నిండా నీరు..

నేను తన నుంచి దూరం అయినందుకు...
వస్తున్న కన్నీళ్ళా..?

పీడా విరగడైంది ..?
అంటూ వస్తున్న ఆనంద భాష్పాలా..?

- నరేష్ ,నేను

నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతికుంటాననుకున్నావు.

నీతొ నడిచిన క్షణాలన్ని నన్ను ఇప్పుడు ప్రశ్నించాయి,
ఎందుకు మళ్ళీ మాకు ఆ అవకాశం ఇవ్వలేదని,
నీతొ మాట్లాడిన నా హృదయం నాకు చెప్పింది,
తను కలిసే దాక మాట్లాడనని మనస్సు మొరాయిస్తుంది

నీతొ నడిచే నా పాదలు చెప్తున్నాయి,
తమతొ పాటు నడిచే నీ పాదలు లేనిదే అవి కదలమని,
కాని వాటికేం తెలుసు నువ్వింక తిరిగి రావని,

నా మనస్సుకు దూరం అయి మరో....?
నన్ను ద్రోహిని చేసి పోయావని ఎన్నిసార్లు చెప్పినా
మనస్సు మారాం చేస్తుంది...ఎలా చెప్పను ఏమని చెప్పను


నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతికుంటాననుకున్నావు.
నీ జీవితానికి అడ్డురాను నీవు సంతోషంగా ఉండాలి
నీవు మోసమోతున్నావు ...అని తెల్సుకునే సరిని నేనుండానేమో..

ఏవి జరుగ కూడదని అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి..
నాకిక తట్టుకునే శక్తి లేదు..మనస్సు నీరస పడుతోంది నిజం
భావోద్వేగాల్లో బందీనై విలపిస్తున్నా ఎంజరుగుతోందని..

కనికరం జాలి లేని మనుష్యుల మద్యి బ్రతకలేం అని మనస్సు తేల్సింది..
ఈ మనుష్యులు ఇంతే వద్దు ఎవ్వరూ వద్దంటూ కన్నీరు పెడుతోంది మనస్సు.
నేనేమయింది ఆనవళ్ళూకూడా నీకు తెలియకూడదని పిస్తొంది..
తెల్సినా నీవేంచేస్తావు...హేపీగా ఫీల్ అవుతావుకదూ...?



నా కళ్ళకి చీకటి అలుముకుంది,
నా శరీరం చల్లబడింది,నా గొంతు మూగబొయింది,
నా గుండె ఆగిపొయింది,
శరీరాన్ని రాబందులు పీక్కు తింటున్నాయి..
శరీరం నుంచి విడిపోయిన నేనే నీవేంచేస్తున్నావని నీకోసం వచ్చా..
మరొకరి కౌగిలికో హేపీగా ఆనందంగా ఉన్నావు..తట్టుకోలేక పోయాను

ఇలాంటి ఘటనలు చూడలేకే..ఇలా అయ్యాను..
నా నిర్నయం తప్పుకాదనిపించింది..
ఇవన్నిటిని చూడలేక పొతున్నా పారిపోతున్నా...
ఎక్కడికి పోతున్నానో ఎందాకా పోతున్నానో తెలీదు..
ఎంత పరుగులు తీస్తున్నా అలుపు రావడం లేదు..
గుండె నిండా దుక్కం నాకు అలుపు అనిపించడంలేదు..
నాకిప్పుడు శరీరం లేదు ఆత్మగానే పరిగెడుతున్నా..

కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి

కాలం నన్ను మోసం చేసింది, నిన్ను నానుండి దూరంచేసి
మనసు నన్ను మోసం చేసింది నన్ను వదిలేసి నిన్ను చేరి
చివరికి నువ్వు కూడ నన్ను మోసం చేశవు నన్ను ఒంటరిగా వదిలేసి
అందుకే మరణాన్ని అడిగాను తనులేనప్పుడు నేనెందుకని
అది కూడ నన్ను మోసం చేసింది ఎంత చెప్పినా వినటంలేదు..
ఎవ్వరిని లెక్క చేయాల్సిన అవసరంలేదు..జరిగిపోవాల్సిందే

కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..

అసలు స్నేహం అంటే ఏంటి...ప్రేమంటే ఏంటి..?
స్నేహం అంటే టైంపాస్...ప్రేమ అంటే మోసం..?
అవునుకదా ఒకప్పుడు చాలా ఊహించుకున్నా...
అనుభవం మీద ఎన్నో తెల్సుకున్నా..ఏదీ నిజంకాదని..
అన్నీ నిజాలు అని నమ్మితే ..మీకు మిగిలేది..
కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..
మనిషికి మనిషికి మద్యి ఏర్పడ్డ బందాల్లో ఏంటీ తేడా...
నిజాలని నమ్మి బ్రమలో బ్రతక్కండి..
జీవితంలో తట్టుకోలేనంత భాద మిగులుతుంది.....
నాది అనుకున్నదేది మనది కాదు అనుకున్నప్పుడు...కనిపించేది సూన్యిం
ప్రేమ .స్నేహం అనేవి గొప్ప పదాలు ఒక్కసారి దక్కితే...
గొంతులో ప్రాణం పోయేవరకు నిలబడాలి ..ఎలాంటి పరిస్థితులొచ్చినా..
చివరకు ఆస్నేహం వల్ల ప్రాణం పోతుందన్నా హాయిగా ఇచ్చేయాలి..
స్వార్దం అస్సలు ఇద్దరి మద్యికు చేరకూడదు..
కష్టం అయినా సుఖం అయినా ఇద్దరూ కల్సి ఉండాలి...
నేను నమ్మిన నాస్నేహంకోసం ఇప్పటికైనా నేను దేనికైనా సిద్దం..

కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..

అసలు స్నేహం అంటే ఏంటి...ప్రేమంటే ఏంటి..?
స్నేహం అంటే టైంపాస్...ప్రేమ అంటే మోసం..?
అవునుకదా ఒకప్పుడు చాలా ఊహించుకున్నా...
అనుభవం మీద ఎన్నో తెల్సుకున్నా..ఏదీ నిజంకాదని..
అన్నీ నిజాలు అని నమ్మితే ..మీకు మిగిలేది..
కంటినిండా కన్నీరు.. గుండెల నిండా చెప్పుకోలేనంత భాద..
మనిషికి మనిషికి మద్యి ఏర్పడ్డ బందాల్లో ఏంటీ తేడా...
నిజాలని నమ్మి బ్రమలో బ్రతక్కండి..
జీవితంలో తట్టుకోలేనంత భాద మిగులుతుంది.....
నాది అనుకున్నదేది మనది కాదు అనుకున్నప్పుడు...కనిపించేది సూన్యిం
ప్రేమ .స్నేహం అనేవి గొప్ప పదాలు ఒక్కసారి దక్కితే...
గొంతులో ప్రాణం పోయేవరకు నిలబడాలి ..ఎలాంటి పరిస్థితులొచ్చినా..
చివరకు ఆస్నేహం వల్ల ప్రాణం పోతుందన్నా హాయిగా ఇచ్చేయాలి..
స్వార్దం అస్సలు ఇద్దరి మద్యికు చేరకూడదు..
కష్టం అయినా సుఖం అయినా ఇద్దరూ కల్సి ఉండాలి...
నేను నమ్మిన నాస్నేహంకోసం ఇప్పటికైనా నేను దేనికైనా సిద్దం..

ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..

నాది అనుకున్నది ఎవ్వరికి దక్కకూడదనే స్వార్దం..నాకు ఎప్పుడూ
నా వాళ్ళు అనుకున్నప్పుడు వారికోసం ఎమైనా చేయటానికి సిద్దం నేను..
అలాంటి నాకు ఓ స్నేహం ప్రాణవాయువులిచ్చాయి ..ఇప్పుడే అదే ప్రాణం పోయేలా చేస్తుంది..
మనుష్యుల్ని నమ్మాలనిపించడంలేదు..వెలుతురు అస్సలు నచ్చడంలేదు
చీకట్లో ఒంటారిగా ఉండాలనిపిస్తోంది..ఏకాంత హాయిగా ఉంటోంది..
ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..
ఎవ్వరన్నా ఇష్టంగా మాట్లాడుతుంటే...కష్టంగా అనిపిస్తుంది
అవును ఒకరికోసం ఒకరు అని ఎలా ఉంటారు అవన్ని నిజాలేనా..
ప్రాణం ఇచ్చేంత స్నేహం ఉంటుందా అస్సలు ..అన్నీ అబద్దాలుకదా..
ఒకరంటే ఒకరు ప్రాణంగా ఒకరికొకరుగా ఎలా ఉంటారు..విడిపోకుండా..
విషపురుగులు కూడా స్నేహితులైతే చచ్చేవరకు కల్సే ఉటాయంట
మరి మనుష్యులు ఎందుకలా ఉండరు ...వారికి మనస్సుంటుందా..
ఆలా లేని వాళ్ళకు మనస్సు చచ్చిపోతుందా..ఎలా ఉంటారు అలా..

ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..

నాది అనుకున్నది ఎవ్వరికి దక్కకూడదనే స్వార్దం..నాకు ఎప్పుడూ
నా వాళ్ళు అనుకున్నప్పుడు వారికోసం ఎమైనా చేయటానికి సిద్దం నేను..
అలాంటి నాకు ఓ స్నేహం ప్రాణవాయువులిచ్చాయి ..ఇప్పుడే అదే ప్రాణం పోయేలా చేస్తుంది..
మనుష్యుల్ని నమ్మాలనిపించడంలేదు..వెలుతురు అస్సలు నచ్చడంలేదు
చీకట్లో ఒంటారిగా ఉండాలనిపిస్తోంది..ఏకాంత హాయిగా ఉంటోంది..
ఎవ్వరన్నా ఆప్యాయంగా మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తోందెందుకో..
ఎవ్వరన్నా ఇష్టంగా మాట్లాడుతుంటే...కష్టంగా అనిపిస్తుంది
అవును ఒకరికోసం ఒకరు అని ఎలా ఉంటారు అవన్ని నిజాలేనా..
ప్రాణం ఇచ్చేంత స్నేహం ఉంటుందా అస్సలు ..అన్నీ అబద్దాలుకదా..
ఒకరంటే ఒకరు ప్రాణంగా ఒకరికొకరుగా ఎలా ఉంటారు..విడిపోకుండా..
విషపురుగులు కూడా స్నేహితులైతే చచ్చేవరకు కల్సే ఉటాయంట
మరి మనుష్యులు ఎందుకలా ఉండరు ...వారికి మనస్సుంటుందా..
ఆలా లేని వాళ్ళకు మనస్సు చచ్చిపోతుందా..ఎలా ఉంటారు అలా..

ఎంచేయాలో తెలీక ఓంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా..ఎందుకో ఈ వేళ

sqఆ క్షణం
మొదటిసారి …..నీ కాళ్ళ ఎదుట నిలిచిన … రోజు కావలి ..
మొదటిసారి …..నీ తో నడిచిన పయనం కావాలి ..
మొదటి సరి …..నీ తో మాట్లాడిన క్షణం కావలి ..
మొదటిసారి నిన్ను తాకిన పులకరింత కావాలి మల్లి కావాలి..
ఒక్కసారి ………… ఎన్నో చెప్పాలనుకున్న కానీ కుదరలేదు .
ఎన్నో మాట్లాడాలనుకున్న కానీ కుదరలేదు…
ఆక్షనాని మళ్ళీ తిరిగి వస్తాయా..కనీసం కలలోనైనా..
ఒకప్పటి నిజాలు ఇప్పుడు అబద్దాలు గా మారాయి..
గుండెకు గాయాలు చేశాయి ..ఎప్పటికీ ఆగాయం మానేలా లేదు...
ఎంచేయాలో తెలీక ఓంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా..ఎందుకో ఈ వేళ
తిరిగిరాని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ..చీకటైనా భవిష్యత్తుకు తలచుకొంటూ..

అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు..

అందరూ ఎందుకు నాలా ఆలోచిస్తున్నారు..
నేనిలా అంటున్నాను అంటే రీజన్ ఉంది..మరి అందరికి..
ఓ విషయంలో గెలవలేనంతగా ఓడిపోయా కాబట్టి తప్పదు
నా నిర్నయం నేను తీసుకోని పోదామంటే ఇదేంటి ఇలా జరుగుతుంది...
ఎందో గుండె దైర్యం ఉన్న వారు కూడా ఇలా డీలా పడీపోవడం ఆచ్చర్యం వేసింది..
నేను ఎందుకు సహాయం చేయలేకపోయా అని భాద వేసింది..
... ఆవకాశం ఉండీ నేనెందుకు సహాయం చేయలేక పోయాను...?
....కోచెం సమయం ఇచ్చి ఉంటే ..ముందుగా చెప్పి ఉంటే బాగుండేది
... నిజమే ఎదైనా అనుభవిస్తున్నా వారికే ఆ భాదవిలువ తెలుస్తుంది...
స్నేహితుల మై ఉండీ ఆమెకు ఆ ఆలోచన రాకుండా చేయలేకపోయా0 ..?
నిజమే డబ్బు చాలా నీచం అయింది ఎంతటి మనిషిని అయినా కుంగదీస్తుంది..

నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిదుర నాకు దూరమై, వేదన చేరువై,

నా మది నీ తలపులతో పరితపిస్తుంటే,

నా ఉహల్లో నీ ప్రతిబింబం నన్ను మైమరచగా,

నీ సాన్నిత్యపు తన్మయత్వంలో ఓ మధుర స్వప్నపు నీడలో నేను సేద తీరుతుంటే,

కాలం కరిగిపోయింది,రాతిరి వెళ్ళిపోయింది,

స్వప్నం చెదిరి పోయింది,మళ్ళీ వేదనే నాకు మిగిలింది.. మరణం దగ్గరవుతోంది.

గతం మిగిల్చిన గాయాల్ని తడుము కొంటూ..దీనంగా వేదనగా..

నిండి పొయింది నా మనసు నీ రూపంతో ఒకనాడు,
అదే నా మనసు నిండి పొయింది బాధలో నీ లేమితొ ఈనాడు,

కలలన్ని కధలయ్యయి, కన్నిళ్లే వరమయ్యయి,
వెన్నెల సైతం కాల్చెస్తుంది నీ విరహ వేదన తొ,

మనిషిని వేదిస్తున్న మనసు..దరిచేరవా అంటూ..
నేను ఒకప్పటి మిత్రుడిని కాదు..శత్రువుని అన్నా వినదు

కన్నీటి సుడిగుండంలో కారనాలు వెతకాలని చూసాను..
మేం విడిపోవడానికి కారణం దొరకలేదు.. ఆవేదన్ తప్ప..

ఆగదు నా హ్రుదయం ఈ క్షణం నీవు లేవని,
ఎదురు చూస్తుంది నీవు వచ్చె క్షణం కొసం............

కదిలే కాలాన్ని ఆపలేను..మదిలోంచి నిన్ను దూరం చేయలేను..
నన్ను మర్చి నీవు హేపీగా ఉన్నావు ..ఎలా అని అడుగలేని నిస్సహాయున్ని..

ఒకప్పటి నిజాలు అన్ని షడన్ గా అబద్దాలు గా మాయాయేమో..
ఎందుకిలా ఎమైందలా అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు వెంటాడూతున్నాయి..

గతం మిగిల్చిన గాయాల్ని తడుము కొంటూ..దీనంగా వేదనగా..
తిరిగిరాని గతం కంటే ..వేదన మిగిలిచిన ప్రస్తుతం కంటే ..
ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత కదా...?
జరిగే ఘోరాన్ని అడ్డుకోలేవు ...పోయే ప్రాణాన్ని ఆపలేవు

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,

స్నేహం చెయ్యాలన్నా ఈ క్షణమే,

ప్రేమించాలన్నా ఈ క్షణమే,

బ్రతకాలన్నా ఈ క్షణమే,

బ్రతికించాలన్నా ఈ క్షణమే,

సమయంలేదు అనుకున్నా తిరిగిరాదు

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి,

రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి
అది నాచేతుల్లో ఉంది నిర్నయం తీసుకున్నా నీవేంచేయలేవు

కంటి ముందే కలవై కరిగిపోయవు సుమా!

నిన్ను అందుకోవాలనుకున్నాను నేస్తమా,
కానీ అందనంత ఎత్తులో ఒదిగిపొయావు సుమా!
నిన్ను కళ్లలొ దాచుకోవాలనుకున్నాను నేస్తమా,
కంటి ముందే కలవై కరిగిపోయవు సుమా!
అలగా నీ ప్రణయ తీరాన్ని చేరుకోలేక,
శిలగా మారిపోతున్నాను,
ఒక బండ గా ఉండిపోతున్నన్నాను...ఈ నాటికి!
నిన్ను చేరేనా ఏ నాటికీ?

నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై ......

నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై ......
నీ మౌనమేంతో బరువై ........నీ మాటలన్నీ కరువై .......
మనసులో భాద తట్టుకోలేక...నిజాన్ని నమ్మలేక
రెప్ప పడదు ఏ కంటికిన నిను కలిసే దాక ...........
నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నను మండిస్తే.........
నువ్వు రేపిన ఆశలే నన్ను నిద్దుర పట్టనీయకుండా చేస్తున్నాయి
నీ జ్ఞాపకాలలో బందినయ్యాక....ఏమి చేయాలో అర్దకాక ఆకాశం వైపు చూస్తున్నా ఇలా
నిను చేరుతానన్న ఆశచావక ఎన్నాల్లిలా ఏన్నేళ్ళీలా ప్రియా
ఈ ప్రాణమెందుకు ఇక ..కన్నీటి కడలోకలిసేందుకు ...వెలుతున్నాలిలా

కలలు కళ్ళలై కన్నీల్లు మిగిలాయి..

నే ఒంటరిని కాను"
నా కనులకు తెలుసు
నే నిన్ను చూడలేనని..!!
నా మనసుకు తెలుసు
నే నిన్ను చేరలేనని..!!
నువ్వు లేవని తెలుసు..
ఇక రావని తెలుసు..
అయినా.. నా నేస్తం నే ఒంటరిని కాను
నీ తలంపులు నాతో ఉన్నంత కాలం
కలలు కళ్ళలై కన్నీల్లు మిగిలాయి..
నీ వెవరంటూ ప్రశ్నిస్తున్న కాలం..
నా కెందుకు దూరం అయ్యావు..
నీవెక్కడ ఉన్నావు..
ఎలా ఉన్నావు అంటూ నామనస్సు నిన్నడుగుతోంది..
అందుకే ఈ భాద బరించలేక పోతున్నా..
నీకు కనిపించని వినిపించనంద దూరానికి

మూసిన కనుల వెనక మూగబోయిన కన్నీటి శబ్దాలు..

నీకోసం ఇప్పటికీ నిదిర లేని రాత్రులు గడుపుతున్నాని నీకు తెల్సు
మూసిన కనుల వెనక మూగబోయిన కన్నీటి శబ్దాలు..
మూలకి విసిరేసిన చిత్తు కాగితాలు....
నీకోసం పిచ్చిరాతలు బ్లాగుల్లో రాస్తూనేను
నన్ను నాకే వొదిలేసి వెళ్ళిన నువ్వు..
చిత్రం కదూ...
మనసు అగ్నిగుండంలా తగల బడుతోంది నీకోసం
మనసు కాలుతున్న వాసన,
కాలి కాలి బూడిదైఏందుకు సిద్దంగా ఉంది
ఏ మూలో మిణుకు మిణుకు మంటున్న ఆశ...
నువ్ రాక పోతావా. అని
కానీ నా మనసుకి భాష రాదు
ప్రేమ ఘోష తప్ప..
ఆశ చావక విరహాగ్నిలో ఇలాగే పోతాను ..
ఇది మాత్రం నిజం నీవస్తావనేది కళ్ళగానే మిగిలిపోతుంది.

ఇంతగా ఇలా మారిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా..

భాదపడటం అలవాటైంది..ఎందుకంటే ప్రతి నిమిషం జరిగేది అదేగా..
నా మీద నాకు ఎప్పుడో నమ్మకం పోయింది...దిగులుగా ఉంది..
నా స్నేహం మీద..నా ప్రేమ మీద నమ్మకం పోయంది..
ఇప్పుడు నన్ను నేను కూడ నమ్మనంతగా మారిపోయాను తెలుసా..
అవును తెల్సుకోవాల్సిన అవసరం నీకేంటి..నే నెవ్వరిని..
ఇంతగా ఇలా మారిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా..
నేనిలా మారటానికి కారణం నీవే ..
నీవు నా జీవితం లో ప్రవేశించాకే మొదలైంది..
నీవు దూరం అయ్యాక రూఢీ అయింది..
అందుకే నన్ను నేను నమ్మటం మానివేశాను..
నీవు ఎదురుగా వచ్చి నాతో ఇదివరకటిలా మాట్లాడినా నమ్మలేనంత మారిపోయా..
అప్పటి నీనవ్వులు..నీమాటలు ఇంకా నాపక్కన ఉండి మాట్లాడి నట్టుంది ..
అప్పుడు తెలీలా ప్రియా అది శాశ్వితం కాదని నిజం అని నమ్మా..
అప్పుడు తెలిదు అవన్ని ఒట్టి బ్రమలని ..అవే శాశ్వితం అని నమ్మా
మనసులో కొండంత భాద పెట్టుకొని బైటికి నటించడం కష్టంగా ఉంది..
నలుగురితో హేపీగా ఉన్నట్టు నటించడం నావళ్ళ కావడంలేదు..
అవును ఇప్పటికీ నాకూఅర్దం కానివి చాలా వున్నాయి తెలుసా..?
ఎవ్వరు భాదపడ్డా తట్టుకోలేవు నేను తప్ప ఎందుకని..
ఎవ్వరికి ఎమైందని తెలిస్తే అంతగా ఫీల్ అవుతాను నాకు తప్ప..
అందరి తో బాగుంటావు నా ఒక్కడీతో తప్ప ఎందుకని అలా..?
నిజంగా నేను మంచి వాడిని కాదుకదా అందుకే ఇలా చేస్తున్నావు..
ఒకప్పుడు ఉన్న ఇష్టం ఏమైంది ఇప్పుడు...
అవును నీకు నేనంటే ఇష్టంలేదు కదా అందుకే ఇలా చేస్తున్నావా..
నీకు చూడాలనుకున్నా కనిపించనంత దూరం పోతున్నాలే..
ఒకవేల నీ మనస్సు మారి నన్ను చూడాలనుకున్నా నీవు చూడలేవు...
" I MISS U " అని నీవు ఎవ్వరికైనా చెప్పి
ఉంటావు నాకు చెప్పే అవకాశం ఇవ్వను GUD BYEE 4 Ever..

ఎందుకొచ్చిందీ తేడా ఇలా ఎలా ఎందుకు మారావని అడుగలేను ..?

ఎందుకిలా చేస్తున్నావు...ఏంజరుగుతోంది...
ఒకప్పుడు నీవు నా హృదయాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నావు..
ఎక్కడ నేను భాదపడతానో ప్రతి క్షనం మదన పడేదానివి..
నన్ను నాహృదయాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు..
చిన్న గాయం అయినా తగలకుండా అవకాశం లేకుండా..
ప్రపంచంలో నాలాంటి అదృష్టవంతులు లేరని తెగఫీల్ అయ్యేవాడీని
ఇప్పుడు నా హృదయాన్ని కాళ్ళకింద తొక్కి ఆనందిస్తున్నావు.
అప్పటికీ కొందరి కసి తీరలేదేమో పదునైనకత్తితో దారుణం గా పొడిచావు..
రక్తం ఓడుతున్న నా హృదయాన్ని చూసి నీవు పగలబడి నవ్వుతున్నావు..
అంతకంటే దారుణంగా నాహృదయం తగల పడిపోతే బాగుండనుకుంటున్నావు
ఎందుకొచ్చిందీ తేడా ఇలా ఎలా ఎందుకు మారావని అడుగలేను
నేనైపోతున్నానో పట్టించుకోవడంలేదు....
హృదయాన్ని ఎందుకిలా గాయం చేశావు ...
ఇప్పుడర్దం అయింది నీవేం కోరుకుంటున్నావో ..
నేను నీకు కనిపించకూడదు ..నా మాట నీకు వినిపించకూడదు..
నామాట వినిపిస్తే చిరాకు..నేను నీకు కనిపిస్తే......?
సారి అర్దం చేసుకోలేక పోయా ఇప్పటిదాకా..నీకోరిక త్వరలో నెరవేరుతుంది..
నీవు ఊహించనంత దారుణంగా..ఉంటుంది అదిచూసి నీవు హేపీగా ఫీల్ అవుతావు.
.....నీవు నీతో పాటు మరో వ్యక్తి కోరుకునేది అదేగా..

మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...

ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....?
మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది..
గుండేళ్ళో మంటలు ఆర్పలేదుకాని...
ఆ మంటల్ సెగలు పైకి అనిపించకుండా చేస్తుంది..
తాగేప్పుడు చేదుగా ..
గొంతులోకి వేళ్ళేప్పుడు మంటగా..
గుండేల్లోకి చేరగానే హాయిగా అనిపిస్తుంది..
ఆ మందు గుండెల్లోకి చేరగానే పనిచేయటం ప్రారంబిస్తుంది..
గుండేల్లో వేదన భాదని తన మత్తులో హాయిగా జోగేలా చేస్తుంది..
అప్పుడూ నీజ్ఞాపకాలు మొద్దుబారతాయి...తెలీని మత్తు ఆవరిస్తుంది..
అయినా అప్పుడప్పుడూ ఆ మత్తులో కూడా నీజ్ఞాపకాలు వెంతాడుతూనే ఉంటాయి..
అప్పుడు పెగ్గుల కౌంటర్ పెంచితే..గాని ఊరటరాదు..
అన్నిటికి ఇంగ్లీషు మందులు కనిపెట్టారు..?
మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...
నీజ్ఞాపకాలు వేదిస్తున్నప్పుడు నాకిప్పుడు ఇదే నేస్తం..
నేస్తం నీవు నాకు దూరం అయ్యావని
ఈ నేస్తాన్ని (మందు) ప్రతిరోజు సాయంత్ర కలుస్తున్నాను ..
నీ గుర్తులు,జ్ఞాపకాలు అన్నీ మర్చిపొవాలంటే ఇంతకు మించిన స్నేహితుడు లేడు మరి నాకు

నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి

ప్రియతమా...
నిన్ను వర్ణించుదామంటే,
పదాలకు అందని భావానివి నువ్వు

నీ ముగ్ధ మనోహర సౌందర్యం...
నీపై నాకు గల ప్రేమతో పోటీ పడుతోంది

నిన్ను పలుకరించలేని నా నిస్సహాయత
నన్ను వెక్కిరిస్తుంది..అదే నాకుపిచ్చెక్కుతోంది

నిన్ను ఎంత పొగిడినా నాకు ఇంకా వెలితిగానె ఉంటుంద
అంతగా నిన్ను ఆరోదిస్తున్నాను ఇప్పటికి ఏప్పటికీ
ఆంత ఇష్టం నీవంటే అది గొంతులో ప్రానం ఉండే వరకు ఉంటుంది..

ఇదంతా మాటల మణిహారంలో కూర్చుదామంటే...
నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి

చేతకాని వాడిలా చేతలుడిగి ఆకాశంవైపు ఆవేదనగా చూస్తూ..

ఏమని చెప్పను ఎలా చెప్పను..
మాటలకందని ఆవేదన..
మనసును పిండేస్తున్న నిజాలు..
వద్దనుకున్నా కాదనుకున్నా జరిగే ఘటనలు..
నన్ను నేనే వెక్కిరిస్తున్న పరిస్థితులు


దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని వుంది..
ఇనుప సంకెల్ల్లను కసిగా తెంచాలని..
ఎవరి మీద నాకసి ..ఎందుకు నాకీ ఆవేశం
విషయంలో ఎవ్వరినీ ఏమనలేకపోతున్నా..ఎందుకు
చేతకాని తనమా..నీ మీద ఇంకా మిగిలి ఉన్న ప్రేమా..
ఏమైనా చేయగలను కానీ ఏమీ చేయలేక పోతున్నా..
నీకు చిన్న భాద కూడా కలగకూడదన్నా స్వార్దం..
నన్ను నేను ఓటిపోయేలా చేస్తుంది..ఎందుకిలా
చేతకాని వాడిలా చేతలుడిగి ఆకాశంవైపు ఆవేదనగా చూస్తూ..


ఈ రక్తమాంసదేహం నుండి విమూక్తి పొందాలని..
ఏదో సాధించాలని.. మదిలొ అలజడి..
ఎవరో చెప్పారు..చెవిలో గుసగుస లాడుతున్నారు
నీవు బ్రతకడం దండగని..ఎవరు చెప్పినా అదే నిజం కదా...?
మదిలొని భావాలని వ్యక్తపరచలేని అసహాయతను మించిన ..
భాద మరొకటి ఉండదు నీవే దూరం అయినప్పటి నుంచి..
ఇప్పటిదాకా పడుతున్న భాద ఎప్పటిదాకా..ప్రియా..
అవును నీవు చెప్పింది నిజమే గొంతులో ప్రాణం ఉండేదాకేగా

ఏంటీ వేళ ఈ ఆందోళన...ఎందుకో తెలీదు

ఏంటీ వేళ ఈ ఆందోళన...ఎందుకో తెలీదు
కారణాలు వెతుకుతుంటే కన్నీళ్ళే వస్తున్నాయి
ఎవరు ఎందుకు దాడిచేస్తున్నారో తెలీని క్షనాన కుడా నీవున్నవన్న దైర్యం..
ఎందుకో తెలీసు నీవు మౌనంగా ఉండి నన్ను మాట పెగలటంలేదు..
మనసు ఈరోజెందుకో మౌనంగా రోదిస్తుంది నీవు గుర్తుకు వచ్చి..
అవును నీవు నిజం..నీ స్నేహం నిజం..నీ ప్రేమ నిజం
నేను మాత్రం అబద్దం, నాస్నేహం అబద్దం , నాప్రేమ అబద్దం..

జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా..కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా

జన్మంతా నీ చెంతే బతకాలనుకున్నా
దైవేచ్చకు తల వంచి నే మరణిస్తున్నా
కలకాలం నీ వెంటే ఉండాలని ఉన్నా
విదికి ఎదురు తిరగలేక నే కన్నుమూస్తున్నా
నిన్ను కానని నా మనసు ఉరకలు వేస్తుంది
కనిపించే ప్రతి వారిని నీ గురించి ఆరా తీస్తుంది
ఏమైనా ఈ క్షనమే కలవాలంటుంది
నీ నేస్తం ఇక లేడని చెప్పాలంటుంది
ఏమీ చేయలేని నిస్సహాయున్నా రా నేను
అడగకనే నీ ఆశలు తీర్చాలనుకున్నా
చెప్పకనే నా శ్వాసను వదిలేస్తున్నా
నీ కల్లల్లో కన్నీటిని తుడవాలనుకున్నా
నీ ముందుండీ కదలలేక శిలనై పొతున్నా
నన్ను విడిచిన నా ఆత్మ నీకోసం దిక్కులు చూస్తుంది
ఏ దిక్కున నీవున్నా కనీసం ఆఖరి చూపు చూస్తావని..
నీ స్నేహితుల తో సంతోషం బిజీగా ఉన్నావు..
నా మరణ వార్త తెల్సికూడా మౌనంగానే ఉన్నావు..
ఇలా ఉంటా వని నేను కలలో కూడా అనుకోలేదు..
నేనిక బ్రతికి ఉండటం వేష్టని నీవు చెప్పకనే చెప్పినట్టుంది
కాని చివరిసారి నీ నవ్వును చూడాలంటుంది
నవ్వలేని నిన్ను చూసి నాకు ఏడ్వాలని పిస్తుంది
నేనిప్పుడు చచ్చిన శవాన్ని అని మర్చిపోయా..
రాలిపోయి నేలపైన శిలనై పడి ఉన్నా
వీడిపోని నీడనై నడవాలనుకున్నా
కదలలేని కాయమై ,ఓ కలనై పోతున్నా
గతియించిన నా దేహం 
నీ ముందే ఉంది
నేను ఇప్పుడు బ్రతికి లేని ఓ జీవం లేని శవాన్ని
నీ స్పర్శకు నోచుకోక కన్నీరు మున్నీరవుతోంది
ముందుకొచ్చి ముద్దిచ్చి సాగనంపు నేస్తం ప్లీజ్
మనసారా కౌగిలించుకో ఇది నా ఆఖరి కోరిక
అందరాని తీరాలకు నే అడుగులు వేస్తున్నా
అనంతదూరానికి వెలుతున్నా నీవు లేకుండా

గుండెనెవరో బయటకు లాగి ముక్కలు చేస్తున్నట్టూ....?

అర్ధరాత్రి ఉన్నట్టుండి జ్ఞాపకాలు రెక్కలు తొడిగి రోడ్డున పడతాయి
అందరి కాళ్ల కింద నలుగుతూ పయనిస్తూనే ఉంటాయి..
ఇలా నిదురలేని రాత్రులు ఇప్పటికీ గడుపుతూనే ఉన్నా

ఉదయం మూడుగంటలు,ఎనిమిది గంటలు
మద్యాన్నం రెండు గంటలు, నీవు నిదుర లేచే నాలుగు గంటల సమయం
సాయంత్రం పదిగంటల సమయం ..ఇవేమీ మర్చిపోలేను ఎప్పటికీ...
ఇలా ప్రతి క్షనం నీజ్ఞాపకాలను ఇప్పటికీ తడుముకుటూనే ఉన్నా

గుండెనెవరో బయటకు లాగి ముక్కలు చేస్తున్నట్టూ
గుండెను ముక్కలు ముక్కలుగా చేస్తున్నట్టూ.

ప్రతి రోజూ అర్ధరాత్రి వరకు అదే వేదన
గుండె కుమిలి కుమిలి కన్నీటి చుక్కగా మారే ముందు కలిగే వేదన
చీకట్లను చీల్చుకొని ఉదయించేందుకు సూర్యుడు పడే వేదన..
ప్రతినిమిషం ప్రతిక్షనం నేను పడుతున్న వేదన నీకు తెల్సు .
అయినా మౌనం వీడవు కారణం ఏంటని అడిగే హక్కులేదు నాకు
ఎందుకో భయమేస్తోంది తెల్లవారుతుంటే ఎం వినాల్సి వస్తుందోనని
...

నన్ను దోషిని చేసి అన్నీ సాదించుకున్నా వాడి మనసు కరుగలేదు

రాలిపడిన ఉల్కలాంటి చిటికెడు ప్రేమతో కొలిచాను
ప్రాణం వీచిన నీ ప్రేమ మహావృక్షం ముందు
చిన్నిమొక్కలా నీ ప్రేమకోసం ఇంకా చుస్తూనే ఉన్నా..


నీవెంత అవమానించినా అవమానించినా మన్నిస్తావనే నమ్మకమెలా వచ్చిందో నాకు!
బహుశా...ఇంకా నీమీద ఉన్న ప్రేమే కారణం అనుకుంటా
నా అహం నీ మెత్తని ప్రేమకు తల బాదుకుని ఇప్పటికి మరణించి వుంటుంది!
ఎంతసేపూ నీ గురించే...ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయి
బహుశా...ప్రేమను గుర్తించలేకపోతే అప్పటికే ‘నేను’ మరణించి వుంటాను!
ఓ వ్యక్తి
అతని అసమర్థత... అతని స్వార్థం...
నీకేమీ ఇవ్వలేనితనం... చేతకాని దోషం...
అన్నీ కప్పిపుచ్చుకోవటానకే నిన్ను ఏమనలేక..
నన్ను దోషిని చేసి దూషించటాలు... ద్వేషించటాలు...
నన్ను దోషిని చేసి అన్నీ సాదించుకున్నా వాడి మనసు కరుగలేదు
నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తే..నిన్ను అంతగా నమ్మితే..
నాస్నేహాన్ని ఎందుకు అడ్డుగా పెట్టుకోని ఆడుకొన్నాడు
గుండెలనిండా నీమీద మోహమా ప్రేమా అది..

మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....?

నీకు నాకు మద్య ఏమంత దూరం
భావానికి భావుకతకి మద్య స్రుజనాత్మకతేగా
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న దూరమేగా
మౌనానికి మాటకి మద్యనున్న దూరం ఎంత
ఆశకి ఆచరనకి మద్యనున్న సంకల్పమేగా
ఆచరణకి అహానికి మద్యనున్న అంతరంమేగ
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమేగా
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగించవా....
నువ్వు నా కోసం రావా
నువ్వు ఎదురైయ్యే క్షనాల కోసం
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...
అది నా మరణానికి ముందా తరువాతా...?

ఓ మనిషికి మనస్సు మద్యి దూరం ఇంత వేదన కలిగిస్తుందా.

నీకై వెదుకులాటలో...
ఎక్కడో నన్ను నేను పారేసుకున్నాను
జీవితాన్ని చేజార్చు కుంటున్నను
ఇప్పుడు అంత శూన్యం
నాకు నేను మిగలకుండా ఎందుకిలా.....?
ఒక్క నీ కోసం చాల పోగుట్టుకున్న
నాకు ఎందుకింత ఆశ....?
నీ కన్నుల వెలుగులతో నా జీవితాన్ని నింపుకోవాలని..
నాకనిపిస్తోంది ఆశ హద్దులు దాటుతోందని నిజమేకదా..

ఓ మనిషికి మనస్సు మద్యి దూరం ఇంత వేదన కలిగిస్తుందా.
నీకు నేనున్నానంటూ చెప్పిన మనిషి ఇప్పుడెక్కడ
కాలగమనంలో నన్నొంటరికి చేసి ఎక్కడికి వెళ్ళీంది..
కన్నీళ్ళతో కలిసుండ మని..
నీజీవితానికి అదే ఎక్కువంటూ వెక్కిరిస్తోంది కదూ
కాలం చేసే కచేరిలో విషాద గీతాలు పాడుకోమని ..
ఒకమనిషు దూరం అయితే ..
మరో మనిషిలో ఇంత భారం ఉంటుందని..
ప్రతిక్షనం ఇంత వేదన పడాల్సి వస్తుందని..?
నీకు తెలుసా ...ఎప్పుడన్నా గుర్తుకు వస్తానా..
నాలుగు జన్మలకు సరిపడా విషాదాన్ని నాకు మిగిల్చి..
నేనెవ్వరూ గుర్తు పెట్టూకోలేనంతగ దూరంగా ఎందుకు ఉంటున్నావు..
క్షమించు నిన్ను అడిగే హక్కు నాకు లేదుకదూ ..నా లెవల్ మర్చిపోయా..
నేను బాగా ఎక్కువగా ఊహించుకున్నానేమో కదా...?
జరిగింది అంతా వాస్తవం అని నమ్మానేమో కదా..?
వెర్రివాన్ని జరుగబోనే అసలు నిజాన్ని గుర్తించలేక పోయా..?

గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మొదటి చూపులోనే కనులలో నిండిన రూపాన్ని మదిలో చేర్చద్దని,
వారిద్దామనుకున్నాను కాని నా ఆలోచనల ముందు ఓడిపోయాను.

గుండెలో రాసుకున్న మాటలన్ని గుట్టుగా దాచుకోకుండా,
నీమనసుకి చేరవేద్దమనుకున్నాను,,,
కాని బయటపడనివ్వని నా పెదవి ముందు ఓడిపోయాను.

క్షణానికి ఒకసారన్నా నిన్ను చూడాలని నీ దరిచేరాలని నా మనసు తహతహలాడినా,
రవికాంతిని నింపుకున్న నీ ముఖతేజస్సు చూసే శక్తి నా గుండెకి లేక నీ అందం ముందు ఓడిపోయాను.

నీ మనసులో నేను లేనని తెలిసి, నా మనసులో దాచుకున్న ప్రేమని సమాది చేద్దమనుకున్నా,
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని నా కనుల ముందు ఓడిపోయాను.

మనసుకి తగిలినా గాయాలన్ని తట్టుకుంటూ, తిరిగి నీ ప్రేమకోసం ప్రయత్నిస్తున్నా,
నా ప్రేమను కన్నీరుగా మార్చిన, నీ మనసు ముందు ఓడిపోయాను.

నా ప్రేమను పంచలేక, నీ ప్రేమను పొందలేక, మనసు నిండా నింపుకున్న ప్రేమని,
తుదిశ్వాసతో వదిలేస్తూ, చివరికి ప్రేమ ముందు కూడా ఓడిపోయాను.

మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం నిన్ను మరువనివ్వదు

నీ ఊపిరిని నాఊపిరిగా చేసుకున్న నా ఆలోచన స్వరం నిన్ను మరవనివ్వదు
పెదవి చెర దాటని నీ గుండె లోని భావం నిన్ను మరవనివ్వదు
కనుపాపలు కురవనివ్వని నీ కన్నీటి వర్షం ... నిన్ను మరవనివ్వదు ...
కనిపించే నీ నయనం విడిచిన భాష్యాల బాణం మరపురానివ్వదు
ఆశించని నీ కరమిచ్చిన తొలి చెలిమి వరం నిన్ను మరపురానివ్వదు
మరలా మరలని నీ అడుగుల దురాల పయనం నిన్ను మరువనివ్వదు
మరో క్షణమైనా నిరీక్షించని ఆ ఆఖరి క్షణం నిన్ను మరువనివ్వదు
తరువాత యుగాన్ని తలపించిన నిజాల నిమిషం నిన్ను మరువనివ్వదు...... నిన్ను

"కదిలే కాలం నీ కాళ్ళ కింద నా హృదయాన్ని అణిచివేస్తున్నా ,
మరణించే కాలం మిగిలిఉండే వరకు నా చెలియ నిన్ను మరవనివ్వదు..
తన చెలిమి నిన్ను మరపురానివ్వదు .. "

నీవు నన్నెప్పుడు అర్దం చేసుకుంటావు...ఎన్ని జీవితకాలాలు కావలి

నీవు నన్నెప్పుడు అర్దం చేసుకుంటావు...ఎన్ని జీవితకాలాలు కావలి
ఒకప్పుడు నన్ను చాలా అర్దం చేసుకున్నావు..మరిప్పుడు...
ఏది జరుగకూడదనుకుంటానో అదే జరుగుతుంది..
ఏది వినకూడదు అనుకుంటానో అదే వినాల్సి వస్తుంది.
నీవు నిజంగా చాలా హేపీగా ఉన్నావు ప్రపంచం ఎటుపోతే నాకేందన్నట్టూ...
కొన్ని సమయాల్లో హేపీగా ఉన్న నిన్ను చూస్తుంటే..హ్యుమన్ రిలేషన్ ఇంతే నా అనిపిస్తుంది..
కచ్చితంగా జరుగ బోయే కొన్ని సంఘటనలు నీకు నిజాన్ని తెలుపుతాయి..
జరుగుతున్న వాటిలో ఏది నిజమో తెల్సుకునే ప్రయత్నం చేయి..
కొన్ని నిజాలు నిప్పులై నిన్ను వెంటాడుతాయి నిజం తెల్సుకో...
ఓ మనిషి మనసులో అలజడిని గుర్తించలేవా..ఎందుకలా మారావు..
ఇప్పుడున్న నీవు నీవుకాదు మారావు ఎందుకు మారావు కారణం.
వద్దు ఈ మార్పు నీకు సూట్ కాదు ఎప్పుడూ నీవు నీవు లాగే ఉండు..
చెప్పటానికి నేనెవ్వర్ని అని అడుగకు చచ్చేదాకా నాకా భాద్యిత ఉంది..
ప్రతిక్షనం నిన్ను గమనిస్తూ నీ క్షేమంకోరే మనిషిని నేనే..
నీకేమన్నా జరుగుతుందంటే ప్రాణాలకు ఎదురొడ్డీ నిలచేది నేనే...
నేను నీ నేస్తాన్ని ఒకప్పుడు..ఇప్పుడు కాదు ఇష్ట పడ్డ నేస్తాన్నే కదా..?

నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీ చేతల్ని, గుర్తు చేస్తూ..

నువ్వు రాబోతున్నప్పుడు నేనెదురు చూసిన ప్రతి నిమిషం గంటగా మారి నన్నెంతగా బాధించిందో
ఇప్పుడు నువ్వెళ్ళబోయే సమయం మేఘాలపై పరుగున వస్తూ అంతే బాధిస్తోంది ..
నీతో గంభీరంగా ఉండాలనుకుంటానా !!? నిన్ను చేరేవరకే అది....
నాలుగు రోజులుగా కొమ్మ చివరన నిబ్బరంగా ఉన్న గులాబీని ప్రేమతో సున్నితంగా తాకీ తాకగానే జల జలమంటూ రాలే రేకుల్లా ...
నిన్ను చూస్తే చాలు ఉరకలు వేసే హృదయాన్ని మభ్యపెట్టడానికి ఆ దిక్కో ఈ దిక్కో చూపిస్తున్నా...
నువ్వున్నప్పుడు ఎన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయానో నువ్వెళ్ళిపోతున్నావంటే మరెన్నో చెప్పాలనున్నా... మౌనంగా చూస్తున్నా,,,
నువ్వు మాత్రం నన్నే చూస్తూ .. ఈ కొద్ది క్షణాలైనా కళ్ళనిండా చూసుకోవాలన్నట్టు ...
నిజమే కదా! కొన్ని రోజులైతే నువ్వు నా పక్కనుండవు...
కానీ.. ఎలా..? నిన్ను ఇలా చూస్తానా... అలా ..... మనసు భారంగా మారిపోతోంది ..
తన గుండె చప్పుడు వినిపించాలని విశ్వప్రయత్నం చేస్తుంది.
నువ్వెళ్ళిపోయిన క్షణం .. అప్పటి వరకు నువ్విక్కడే.. నా పక్కనే ... కానీ ఆ పైన నేనొక్కడినే....
ప్రేమలో నీకు నా వీడ్కోలు నా మనసుకి అనారోగ్యం...తట్టుకోవడానికి తగ్గడానికి కాలమే ఔషధం.....
నీ జ్ఞాపకాలైనా ... నన్ను ఓదారుస్తాయనుకుంటే.. అవి కూడా నిర్దయగా నే మోయలేని బరువై మదిలో చేరి ..
నీతో ఉన్నప్పటి నీ నవ్వులని, నీ మాటల్ని, నీతో చేతల్ని, గుర్తు చేస్తూ..
నువ్వు లేనితనాన్ని గుచ్చి గుచ్చి చూపిస్తున్నాయి..
తీపి జ్ఞాపకాలని.... ఒంటరితనంతో పోలుస్తూ.... వాటిని చేదుగా మార్చే వీడ్కోలు భారాన్ని నే తట్టుకోగలనా!!!!!!?

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,

నా ప్రేమకు ప్రేరణ నువ్వు,

నా గుండెకి ఊపిరి నువ్వు,

ఎదను గెలవాలన్న,

వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,

ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,

ప్రేమ నేరమా మరి,

ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.

నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,

నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,

అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,

మనసుని వేధించే బాధ,

ప్రేమ అంటే బాధేనా,

మనసు మనల్ని మరచి,

మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?

నన్ను నన్నుగా వుండనీయదెందుకు?

నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?

నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?

ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,

తెలిసి నువ్వు నాకు చేరువవవు,

ప్రేమ నన్ను వదిలేయి,

తనని నా నుండి దూరం చెయ్యి,

ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,

ఇక తట్టుకోలేను నేను శాశ్వితంగా దూరంగా వెళ్ళిపోతున్నా.

ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..నేను అనే వాన్ని అసలెరుగను అన్నట్టుంటే

మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే వేచి చూసేవాడిని


ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం ఎప్పుడూ
ప్రతిక్షణం వెతుకుతుండేవి

నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను..మరిచాను అ ప్రపంచం


నీవు పరిచయం కానప్పుడు నేనెవ్వరో అన్న ఫీలింగ్
నువ్వు వచ్చాక నాలో ఎక్కడో చెప్పలేని దైర్యిం

ఇంతకు ముందు నాకోసం నేను
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు


ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి..అలా వెళ్ళిపోయావు
ఎందుకిలా జరుగుతోంది అని అడుగలేను..

నీవు మారావు ..నన్ను ఏమార్చావు.
నీవున్నప్పుడు ప్రపంచంలోని సంతోషం అంతా నాదే.
ఇప్పుడు ప్రపంచంలో దుక్కం అంతానాదే ..

ప్రతిక్షనం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..
నేను అనే వాన్ని అసలెరుగను అన్నట్టుంటే ..
నా మనసుకు సమాదానం ఏమని చెప్పుకోను..
ఎందాకని ఊరడించను...చెప్పు ప్రియా

ఇలా ప్రతిక్షనం నీకోసం ఆలోచించే గుండె ఎప్పుడో ఆగిపోతుంది..
అయినా నీమనస్సు కరుగదు అలా తయారయ్యావు ఎందుకో..

నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా

నువ్వు నా జ్ఞాపకాలనుంచి, నా నుంచి తప్పుకోవాలని అనుకున్నా
నీకు తెలిసిన మనసును అడిగి చూడు నీడలా నీ వెంటే వున్నది ఎవరని?
అలిగి అలసిన మాటలనడుగు నీ ఊహల వెనుక ఉన్న ఆశేమిటో
నిజానికి అబద్ధానికి మధ్య నా కలలనీ ఊహలనీ తొక్కిపెట్టిందెవరో
ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసునడుగు నిజం చెబుతుంది

మన ఇద్దరి మధ్య అలుముకున్న చీకటి తెరలని రచించిందెవరో
కనిపించని నిజాలనడుగు అబద్దపు నీడల పొడుగేమిటో
కాలచక్రం ఇరుసులనడుగు కదలిపోయిన కలల కన్నీరు ఏమిటో
నిద్ర రాని నా కన్నులనడుగు నీకు నేనేమిటో

అలా అలవోకగా ఓటమి నన్ను ఓడిస్తూంటే
నిజాల వెంట నీవు ఊహల మధ్య నేను ............
ఎప్పటికీ ఒంటరిగా అదే దిక్కుతోచని సమూహంలో
అయినా! నేనింతకు ముందూ ఒంటరినే ఇక పైనా కూడా .......

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని..ఇంత దూరం అయ్యానెందుకో

మనసు ఇంకా తడిగానే ఉంది..పొడి బారలేదింకా
కాని ఆచెమ్మ కళ్ళను చేరడం లేదెందుకో మరి

నీ చెంత చేరాలని..ఏవేవో చెప్పాలని
హృదయ బారాన్ని దింపుకోవాలని ఉంది

కాని నీ సన్నిది చేరాలంటే..ఏం చేయాలంటూ
నాలోని చేతకాని తనం వెక్కిరిస్తుంది ఎన్నాళ్ళకెన్నాళ్ళ కని

ఎక్కడ నే తడబడ్డానో తెలియక...ఏం చేస్తున్నానో అర్దంకాక
తెలిసినట్లే అనిపించినా దిద్దుబాటులో అడుగులు జారిపోతున్నాయెందుకో?

క్షణ క్షణం నీకు దగ్గరవుతున్నానుకొని..ఇంత దూరం అయ్యానెందుకో
నాకు తెలియకుండానే నీనుండి దూరంగా వెళ్లిపోతున్నాను కదూ ?

అసలేం జరుగుతోంది...ఎవరు తప్పు చేస్తున్నారు కారణం
దాచడానికేమి లేని నేను అయినా మనమధ్య తెలియని అగాధం

తెలిసిన ఒక శూన్యం మనసంతా..తెలియని అవేదన జీవితంలో
తెలియనిదల్లా అధిగమించాలన్న కోరికనెలా ఆచరించాలన్నదే?

నన్ను కాదనవని తెలుసు...ఎందుకు దూరంగా ఉంటున్నావో అర్దంకాదు
క్షమించే నీ మనసు తెలుసు అయినా తెలియని భయం ఆందోళన

చూసావా! నేను చెప్పాలనుకొన్న..ఏం చెబుతున్నానో
విషయాన్ని కూడా నీకర్దమయ్యెలా చెప్పలేకపోతున్నాను కదూ?

ఇకపై ప్రతి క్షణం ఒకే మంత్రం,...నీగురించే ఆలోచనల్
నీవైపు చూస్తూ, నీ మాటలే మదిలో మననం చేస్తూ

నీతోనే నేనని నీలోనే సాగాలని..ఓ తీరని కోరిక
అమ్మలాంటి నీ ఒడిని మళ్ళీ చేరాలని ఓ పిచ్చి ఆలోచన

అందుకోసం నన్ను నేను..పూర్తిగా మర్చిపోయాను
సంసిద్ధ పరచుకోవాలని ఆశతో చేస్తున్నా మరోపోరాటం

సాద్యింకాదని ఈమద్యే తెలిసింది...కాని ఎందుకిలా అని అడుగలేను
ఇప్పటికీ ఓ నిర్నయం తీసుకున్నా ..అటువైపు వడివడిగా అడుగులు వేస్తున్నా

ఎప్పటికైనా నిజం తెల్సుకుంటావు..నన్ను చేరాలనుకుంటావు
అప్పటికి సమయం మించి పోతుంది..కాలం కరిగి పోతుంది
నన్ను తనలో అక్యించేసుకొని నీకు చేరనంత దూరం తీసుకెలుతుంది

నిదుర నాకు దూరమై, వేదన చేరువై

నిశి రాత్రి నీ జ్ఞాపకాలు నన్ను కలవపరుస్తుంటే,

నిదుర నాకు దూరమై, వేదన చేరువై,

నా మది నీ తలపులతో పరితపిస్తుంటే,

నా ఉహల్లో నీ ప్రతిబింబం నన్ను మైమరచగా,

నీ సాన్నిత్యపు తన్మయత్వంలో ఓ మధుర స్వప్నపు నీడలో నేను సేద తీరుతుంటే,

కాలం కరిగిపోయింది,

రాతిరి వెళ్ళిపోయింది,

స్వప్నం చెదిరి పోయింది,

మళ్ళీ వేదనే నాకు మిగిలింది..

జ్ఞాపకాల తోటలో....తొలిసంధ్య ఛాయలో

జ్ఞాపకాల తోటలో
తొలిసంధ్య ఛాయలో
మెల మెల్లగా తాకి
పసిడి పచ్చని చెట్లమధ్య
విరిసిన మొగ్గలన్నీ
నాకోసమేనంటూ
పరిమళాల చిరుగాలితో
చిరునవ్వులే పూయించి
బ్రతుకు నావకు సులువైన
మార్గమేదో చూపించి
చివరి వరకూ నాకు
తోడు నవుతానంటూ
ప్రియమార దరి చేరిన
నా ప్రాణ నేస్తానికివే
సుబోదయం స్నేహమా.

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..

చల్లగాలి నల్ల మబ్బులు
తొలకరి చినుకులు మల్లె పూలు
గమ్మత్తుగా మత్తెక్కిస్తుంటె
రోజంతా నీకోసం నేనెదురు చూస్తుంటే
ఏదో తెలియని మైకం నన్ను
కమ్మెసి నీ వైపు లాగేస్తుంది
ఎందుకంటావ్? నువ్వేం చెపుతావులే
మాయచెయడమే తెలిసిన నీవెక్కడ
అడిగానని చెప్పు..నీ తలపులలోని
వలపు కన్నియను..పిలిచానని చెప్పు
నీ ఎదలో మెరిసే ..వయ్యారి తలపులను
పెదవిపై చేరి..చిరునవ్వుల పూవులే పూయాలని
ఎదురు చూస్తున్నానని చెప్పు..విరిసిన ఆ నవ్వుల పువ్వుల కోసం
నావైపు నడచివచ్చే ..నీ అడుగుల కోసం

కాని అడుగుల చప్పుడు వినిపిస్తోంది
కాని నీవెక్కడ ఎంత వెతికినా కానరావేం..
నాకు తెల్సు ఇంకెప్పుడూ కానరావు కదూ..'
నన్ను మోసం చేశావు కదూ..
దారుణంగా మోసంచేశావు..
ఎందుకిలా చేస్తున్నావు..?
నన్నేందుకిలా వేదిస్తున్నావు..?

నాతో పరిచయానికి ముందే ఇలా జరుతుందని నీకు తెల్సు..
అన్నీ జరిగిన తరువాత నను దోషిని చేసి తప్పుకున్నావు..
నీకిది న్యాయమా...నన్ను అర్దం చేసుకుంది ఇంతేనా..
సంతోషాన్ని నీవు చూసుకున్నావు మరి నేను..?

ప్రతి క్షనం ప్రతి నిమిషం నేనిలా భాదపడతానని తెల్సీ..
ఏమీ తెలియనట్టు అమాయకంగా ..హేపీగా ఉన్నావు..
నేనేమైపోతున్నా అని తెల్సినా నీవు మాట్లాడవు..
నీమనసులో ఏముందో ఇప్పుడు తెలుస్తోంది..
అది జరుగుతుందిలే..ఆరోజొస్తుందిలే..:(

AMMA

_"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి..