Thursday, October 8, 2009

కనిపించని కన్నులలో ఉదయించిన వేలుతురువో,
చిగురించిన మొక్కలలో కదిలే వెన్నెలవో,
వేరబుసిన పువ్వుల యదలో ఒదిగిన తుమ్మెదవో,
గుబాళించే గులాబీల మకరందనివో,
ఎవరు చెలి నీవు.....
కదిలే కొలనులో వేరబుసిన కమలనివ,
పులకించిపోయే కోయిల సంగితనివ,
లేక నా మదిలో మోగే కోటి వీణల సంగితనివ ,
ఎవరు చెలి నీవు ననూ ఎందుకు వేదిస్తునావు.

నా ప్రేమ

హృదయపు తలుపులు తెరిచి ప్రేమ ముంగిట
నీ రాకకై ఎదురు చూసినా నాటి నుండి నేస్తం
నా కనుల మాటున దాగిన సుమధుర స్వప్నం
ముగ్ధమనోహర నీ రూపమేనని తెలియలేదా

నీ గుండె గది లో ఈక నాకు చోటు లేదని తెలిసినా
నా గ్నాపకాల గూటి లో నిన్ను పదిలంగా ఉంచానంటే
నీ పై నా ప్రేమ అపరామయినదని తెలియలేదా
నీవు తెలుసన్నా,తెలియదన్నజరిగింది ఘోరం
నీ ఎడబాటు నా జీవితానికే ఒక పెద్ద శాపం
నీవు దూరమయ్యవనే నిజం నన్ను బాదిస్తున్న
నీవు నాతోనే ఉన్నావనే అందమయినా అబద్డంతోనే
జీవించే ఉన్నా జీవచవంలా........

మరిచిపోదామని మనసునడుగుదామంటే
మరపురాని గతం చేదు నిజమై నన్ను పరిహసిస్తోంది
"మీరు" , "నీవు" గా మారినా నిన్ను నన్ను .."మనం " గా
మార్చలేని నా హృదయం ఒక రోజు మూగబోతే
నా యెద సవ్వడి వినటం మరువకు చెలి
ఎందుకంటే అది మిగిల్చిన చివరి చప్పుడు
నీ పేరే పలుకుతుంది ........

నా హృదయం

నా హృదయం లోని ఆవేదనను నీకు చెప్పాలని
సాగరం లో ఎగసిపడే అలలా నీ దరికి వస్తాను...
కానీ ఈ చిన్న మనసుకేం తెలుసు
హృదయమే లేని చోట ప్రేమను వెతకటం
అత్యాశ అని ....?
నిరాశతో తిరిగి అలలా వెనక్కి వెళ్ళిపోతాను
మళ్ళీ పుడుతుంది వింత కోరిక.....
నా మనసులో మాట చెప్పాలని
మళ్ళీ కెరటం లా నీ దరికి వస్తాను
కానీ అప్పటికి కూడా తెలియదు నా మనస్సుకి
నీ గుండెలో ప్రేమ ఎండమావిలో నీరు అని ....
అంతే...
మళ్ళీ తిరిగి
వెనక్కి వెళ్ళిపోతాను....
వేగంగా...
నిరాశతో......

కన్నుల్లో నీ రూపు కరిగి కన్నీరుగా మారి చెక్కిళ్ళపై జారింది

కన్నుల్లో నీ రూపు కరిగి కన్నీరుగా మారి చెక్కిళ్ళపై జారింది ,


గుండెల్లో నీ ఊసు ఊహగా మారి ఊరించ సాగింది ,

నీ జాడ కోసం నా పాదమే పక్షిగా మారి ఊరంతా తిరిగింది ,

నీ రాక కోసం నా కంటిపాపే కలువలా మారి ఎదురుచూసింది ,

నీ మాట కోసం మదిలోన భావం మెరుపుగా మారి మురిపించ సాగింది ,

నీ చెలిమి కోసం నా పిలుపే నీ తలపుగా మారి తపించ సాగింది ,

నిను చూడగానే నా మోము మరు మల్లెగా మారి విరబుయ్య సాగింది





నా ఆశ నీవే నా శ్వాస నీవే ,

నా ఊహ నీవే నా ధ్యాస నీవే ,

నీవు లేక నేను జీవించలేను ,

నీవు లేని నన్ను ఊహించలేను ,

కనుక ఇన్నాళ్ళ మన స్నేహానికి కానుకగా ,

నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను సంతోషంగా :)

నీకోసం














కోరికలనే గుర్రాలకు రెక్కలోస్తే సప్త సముద్రాలను దాటి వస్తా నీకోసం విహంగాన్నై....




జ్ఞాపకాలనే అలలకు ఉప్పెనోస్తే దాటిస్తా నిన్ను జీవన సంద్రంలో నావనై...



జాబిలి లాంటి మనసు నిదయితే అనుక్షణం దాన్ని కాంతిమయం చేస్తా దినకరుడినై...



కోకిల లాంటి స్వరం నిదయితే జీవితాంతం నీ పాట వింటా వసంతాన్నై...



నింగి లోని మేఘం లాంటి నవ్వు నిదయితే నీకోసం వేచి వుంటా మయురాన్నై...



అందని ఆకాశం లో తరావు నువ్వయితే నిన్ను నాలో కలిపెస్తా...పాలపుంతనై....



చెలీ...నా ప్రేమకు స్పందించే హృదయం నీ కుందంటే...వేచి వుంటా వేయి జన్మలయినా నీకోసం నిర్మోక్షుడినై......











నా కనుల కొలనులో ఉహల నావపై నీ జ్ఞాపకాల kalalu విహరించినా......


నా మనసు తోటలో నీ నవ్వుల పువ్వులు వికసించినా......


నా ఎదలో నీ సిరిమువ్వల పాదాల సవ్వడి వినిపించినా ......


నీ నయన కాంతులకు నా హృదయ చక్షువులకు మెలకువ వచ్చినా...


నా జీవన ఎడారిలో తొలకరి జల్లులా నీ సాన్నిత్యం నన్ను తన్మయ పర్చినా....


నా హృదయ సంగీతానికి మయురంలా నీ పాదాలు నర్తించినా.....


నా హ్రుధయాశడంలో నీ మనసు మేఘాలు రాగాలు పలికినా....


అందని జాబిలి లాంటి నీ మనసులో నాకు చోటు దక్కినా...అదే నాకు హృదయ ప్రమోదము .....అదే నాకు జన్మ సాఫల్యము....



-----------------------------------------------------------------------------------------------------------------

కొంటెనవ్వుతో చూసే ఓరకంటిచూపులు
ఉలిక్కిపడి నిదురలేచిన ఆశలు.

దూరమయ్యే నీ మువ్వలచప్పుళ్ళు,

ఆగిపోతున్న నాగుండె చప్పుళ్ళు.

కనుమరుగవుతున్న నీ ప్రతిరూపం,

కనులకు అది కన్నీటి శాపం.

అస్తమిస్తున్న నీ కనుల అరుణాలు,

నా మనసుకి చీకటితోరణాలు.

ఏకాంతంలో కదలాడే నీ తియ్యని జ్ఞాపకాలు,

చెంతలేవని గుండెకుచేసే గాయాలు

నీకై ఎదురుచూసే నా  తడి నయనాలు,

మనోరుధిరం నింపుకున్న ఎరుపుచారలు.





===================================================================


మది నిండిన నీ ఆలోచనలు,


నిన్ను వెతకమని కనులను కలవరపెడుతుంటే,


నీ రూపం కనబడక అవి కన్నీరు పెడుతుంటే,


మనసు నిన్ను స్వప్నంలో ప్రతిబింబిస్తానంటే,


నిదురలో కూడా మధురస్వప్నమే కదా




===================================================================


నేస్తమా ఎలా నీకు తెలుపగలను,


ఒంతరితనపు ఎడారిలో ఒయాసిస్సు వయ్యావని,


అనుమానాల చీకటి అలుముకున్న నాకు అనుబంధాల వెలుగు వయ్యావని,


ఆప్యాయతలు పంచే అమ్మ వయ్యావని,


ప్రతిక్షణం ప్రాణంగా చూసుకునే ప్రాణమయ్యావని,


అన్నికలిసి నా మనసులో సుస్థిరస్థానం నిలుపుకున్న స్నేహాని వయ్యావని,


స్నేహమా ఎలా చూపగలను,


నీ రాకతో నా మనసుకు కలిగిన ఆనందాల అనుభూతిని,


మదిలో నీకోసం కట్టుకున్న స్నేహ కుటీరాన్ని.


గుండెలో భద్రంగా దాచుకున్నా నీ ప్రతిరూపాన్ని.


మాటల కందని మాధుర్యం నీవు,


మనసుని గెలుచుకునే మైత్రివి నీవు.



=======================================================================


నీ తలపులతో అలలై పారే ఆగని కన్నీళ్ళు,


మనసుని కాల్చేస్తున్న జ్ఞాపకాల జ్వాలలు,


నీ రాక కోసం ఎదురుచూస్తూ నిదుర మరచిన కన్నులు,


నీ తోడులేక నీకై ఒంటరితనపు ఆలోచనలు,


నీవు చేరువవ్వలేదని అనుక్షణం రగిలే మనసు,


ఇవేనా చెలి నీ ప్రేమ కానుకలు.



--------------------------------------------------------------------------------------------------------------

నీ కన్నులను కాంచిన క్షణం కలలు కరిగిపోతుంటే,

నీ అధారాలను చూసిన తరుణం ఆశలు ఆవిరయ్పోతుంటే,


నీ ఊపిరి తగిలిన సమయం ఊహలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే,


నీవు ఎదుటబడిన నిముషం ఎదలోని భావాలు ఎగిరిపోతుంటే,


నీ చూపులు తాకిన మరుక్షణం మాటలు మాయమవుతుంటే,


మాట చెప్పేదెలా! మనసు తెలిపేదెలా!!





మనసులో కురిసిన తొలకరి స్నేహపు చిరుజల్లువా,


ఎదలో మాటలవెన్నెల కురిపించిన జాబిల్లివా,


ఒంటరి గుండెకు తోడు నిలిచిన స్నేహానివా,


మదిలో మత్తుగా వీచిన సమీరానివా,


మౌనపు గుండెలొ మాటలు జల్లులు కురిపించిన మేఘానివా,


లేక నా చీకటిహృదయం కోరుకునే తోలిసంధ్యవా




వర్షపు చినుకుల జోరుని చూడు,


నీకోసం వేదన చెందే నీలాకాశపు మేఘల కన్నీరు కనబడుతుంది,


మత్తుగా వీచే చిరుగాలిని చూడు,


నిన్ను చేరాలని ఆవేశపడే తీరు కనబడుతుంది,


నా కన్నుల నుండి జారే కన్నిటిని చూడు,


నా గుండెలో నిండిని నీ ప్రేమ కనబడుతుంది.


ప్రకృతి సైతం నీ కన్నుల అందానికి బంధీ కాలేదా,


అటువంటిది ఇక నా మనసెంత?


మనసుకి రెక్కలు వచ్చి ఏనాడో ఎగిరిపొయింది.


నీ రూపన్ని బహుమతిగా ఇచ్చి ఆనాడే వదిలిపొయింది.




నీ ప్రేమ నన్ను ఒంటరిని చేసింది నీ ఆలొచనలతో,


క్షణక్షణం గుండెలో రగిలే అగ్నిజ్వాలలతో నా మనసు మండుతున్నట్లుంది,


నీ చూపులు కరువై నా కన్నులకి అంధకారం అలుముకుంది,


ప్రేమిస్తున్నాననే మాటని పెదవులు నుండి దాటించలేకపోయాను,


నా ప్రేమభావనని నీ మనసులో చేర్చలేకపోయాను,


కాలం నిన్ను నాతో కలుపుతుందనుకున్నాను,


కాని నీ చేతులతో శుభలేఖ అందుకున్న నాకు,


ఒక్కసారిగా గుండెలొ రగిలే అగ్నిపర్వతం పేలింది,


కన్నీటిలావా గుండెలోతుల నుండి బయటకోస్తుంది,


కన్నీటిగోడలతో ఎదురుగావున్న నీ రూపం మసక బారుతుంది,


లోకం మొత్తం చీకటయ్యింది,గుండె వేగం తగ్గుతూవుంది,


శుభలేఖ చేజారింది, తుదిశ్వాసతో గుండె ఆగిపోయింది,


మరణం నాకు చేరువయ్యింది, ప్రేమ నాకు దూరమయ్యింది.




నీ తలపులు తన కోసమే అని తెలుసు,


నీ గుండెలో నిండినది తన ప్రేమేనని తెలుసు,


కాని మనసు మాట విడటం లేదు,


నిన్ను అది మరవటం లేదు,


నీ మనసుని తనకు పంచి తన ప్రేమను స్వీకరించావని తెలిసి కూడ,


నీ మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,


నీ మనసు ఎడారిలో ప్రేమ దాహం తీర్చుకోవాలనుకుంటుంది,


వినవా మనసా తానిక మనకు దక్కదని అంటే,


కనీసం తన ఆనందంలో నన్నా నా ప్రేమను చూసుకుంటానూని అంటుంది,


ప్రేమ దొరకకపొయినా ప్రేయసిని చూస్తూ గడిపేస్తానంటుంది,


కన్నీటి జ్వాలలు మనసుని కాల్చేస్తున్నా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంది.





ప్రేమించలేను నేస్తమా,


ప్రేమించానని నువ్వు చెప్పినప్పుడు ఏమిచెప్పాలో తెలియలేదు,


స్నేహంగా నిన్ను చూసిన నాకు ఆ భావన కలగలేదు,


నా మౌనం అంగీకారం కాదు నేస్తమా,


నీకు సమాదనం చెప్పే దైర్యం లేక నా మనసు మూగబొయింది,


నేను ప్రేమించలేదని నీకు చెప్పినపుడు నువ్వు పడ్డ బాధ నా మనసుని గాయపరిచింది.

నా ప్రేమ దొరకక నీ కన్నుల నుండి జారిపడ్డ కన్నీరు ఇంకా తడి ఆరక నా పాదలపై మెరుస్తుంది,

ఎరుపెక్కిన నీ కన్నులలోని రక్తఛార ఇంకా నా కనుపాపల నుండి చెరిగిపోకుంది.


మూగబోయిన నీ స్వరపు మౌనరాగం నా గుండెను గాయం చేస్తుంది,


ఎలా తెలుపను నేస్తమా నా స్నేహభావాన్ని,


ప్రేమను స్వీకరించలేక,స్నేహన్ని దూరం చేసుకోలేక నేను,


స్నేహాన్ని వదులుకోలేక,ప్రేమను పొందలేక నువ్వు,


మౌనపుసంద్రానికి చేరో ఒడ్డున నిలిచిపొయాము.


నేస్తమా ఎలా సమాధాన పరచాలి నిన్ను?





నువ్వు నేనైన నేను, నేను నువ్వైన నీకు,


నన్ను కాగితంగా మార్చి నిన్ను కవితగా చేసి,


రాస్తున్న ప్రేమలేఖ,


నేనైన నీకు నన్ను మరవద్దని,


నిన్ను నువ్వు వదులుకోవద్దని,


నన్ను నీలొ కలుపుకొని నిన్నుగా మార్చిన నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.


మొన్న నేను నేనుగా ఉన్నాను,


నిన్న నేను నిన్ను చూసాను,


నన్ను నేను మర్చిపొయాను,


నిన్ను నాలో కలుపుకొని నేను నువ్వుగా మారిపొయాను,


కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని నిన్ను నన్నుగా కాకుండ,


నీలాగానే మిగిలిపొయావు,


నిన్ను నువ్వు నీలో నన్ను కలుపుకోని నన్నుగా ఎప్పటికి మార్చుకుంటావు,




నా మది నింగిలోని జాబిలి మాయమయ్యింది,


నా ఆనందపు వెన్నెల కరువై చీకటి మిగిలింది,


మన తీపి అనుభూతులు జ్ఞాపకాలుగా మారాయి,


ఆ జ్ఞాపకలు నా హృదయమేఘంలో కలిసిపొయాయి,


నీ జ్ఞాపకాలతో ఆ మేఘం నిండిపొయింది,


ఇప్పుడు నీ చూపుల కాంతులు మెరుస్తున్నాయి,


నీ చిరునవ్వుల చిరుగాలిలా వీస్తునాయి,


ఆ చిరుగాలికి నా హృదయమేఘం కరిగి ఆనంధభాష్పాలు రాల్చింది.




telugu kavithalu

ప్రేమించానని చెబుదామంటే ఆత్మాభిమానం అడ్డొస్తోంది......




చెప్పినా నువ్వు దూషిస్తే నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది....



అలాగని చెప్పకున్నా ..ఆత్మన్యూనతా భావం నన్ను వేధిస్తోంది.. ..



చెప్పక, చెప్పలేక, చెప్పకుండా వుండలేక నా మనసు రగిలిపోతోంది...



ఆయినా నాకనిపిస్తోంది..నీ జ్ఞాపకాల ఒడిలో ఈ జీవితం ఇలాగే గడిపెయ్యోచ్చని

AMMA

_"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించి మట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి..